నేను ఓకే అనేదాకా విడుదల వద్దు… దేవరకొండ

Vijay Deverakonda movie to be delayedయూత్ లో బాగా ఫాలోయింగ్, ట్రేడ్ లో ఫుల్ గా క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. ఆనతికాలంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈ హీరో ఇప్పుడు ఇండస్ట్రీలో తన స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారట. తన తాజా చిత్రం డియర్ కామ్రేడ్ షూటింగ్ ఈ మధ్యే పూర్తి చేశాడు ఈ కుర్ర హీరో. అయితే ఇటీవలే సినిమా కాపీ చూసుకుని ఒకింత నిరాశకు గురయ్యాడట. ఇప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాలు రీషూట్ చెయ్యాలని నిర్మాతలకు చెప్పేశాడట.

తాను ఒకే అనే దాకా విడుదల తేదీని ప్రకటించవద్దని హుకుం కూడా జారీ చేశాడంట. వైవిధ్యమైన సినిమాలు తీసే దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన భరత్.. ‘డియర్ కామ్రేడ్’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడని సమాచారం. గీత గోవిందం, టాక్సీవాలా లాంటి చిత్ర విజయాలతో డియర్ కామ్రేడ్ చిత్రంపై అంచనాలు బాగా పెరిగాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ADVERTISEMENT

రష్మిక మందన మహిళ క్రికెటర్ పాత్రలో ఈ చిత్రంలో కనిపిస్తుందట. వీరిద్దరూ ఇప్పటికే కలిసి గీత గోవిందంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే రిషూట్లు అయ్యాకనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు విజయ్ ఇప్పటికే తన మరో సినిమా షూటింగ్ మొదలు పెట్టేశారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తున్న ఆ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటుంది.

ADVERTISEMENT
Latest Stories