విజయ్ దేవరకొండ…. ఈ సారి సైలెంట్ గా…!

Vijaya Deverakonda - NOTA- release dateసెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సినిమా విడుదల అవుతోందంటే, సాధారణంగా ఓ 15 రోజుల ముందు నుండి ఆ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ ప్రారంభమవుతుంది, అది కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించే విధంగా! కానీ అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “నోటా” సినిమా పబ్లిసిటీ మాత్రం విజయ్ దేవరకొండ స్టైల్ లో లేకపోవడం అభిమానులకు నిరుత్సాహాన్ని కలిగిస్తోంది.

[m9ad]

ADVERTISEMENT

అక్టోబర్ 4వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభం కాబోయే ప్రీమియర్ షోల నుండి మొదలుకానున్న “నోటా”కు సోషల్ మీడియాలో ఏ మాత్రం హంగామా లేకపోవడం విశేషం. ఓ పక్కన చిత్ర యూనిట్ పోస్టర్లు రిలీజ్ చేస్తోన్నా, వాటికి ఆశించిన రీతిలో స్పందన లేకపోవడం.., సినిమాపై బజ్ ఏర్పకపోవడం… ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావితం చూపనుంది.

‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న వెంటనే వస్తోన్న సినిమాగా “నోటా”పై భారీ అంచనాలు ఏర్పడాలి. కానీ ఈ సినిమా ట్రైలర్ లో ఎక్కువగా తమిళ వాసన ఉండడం, విజయ్ దేవరకొండ హైలైట్ అయ్యేలా ట్రైలర్ లేకపోవడంతో… ప్రేక్షకులలో క్యూరియాసిటిని పెంచలేకపోయింది. విడుదలకు ఇంకా 7 రోజుల సమయం ఉంది గనుక, ఈ లోపున విజయ్ మ్యాజిక్ ఏమైనా చేస్తాడేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories