విజయ్ దేవరకొండ మంచి రైసింగ్ లో ఉన్న హీరో. అయితే ఈ హీరో ప్రస్తుతానికి తన హిట్ ట్రాక్ ను ఆస్వాదిస్తూ ఉన్నాడు. వరుస హిట్స్ తో దూసుకుపోతూ అసలు క్షణం తీరిక లేకుండా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతానికి భరత్ కమ్మ దర్శకత్వంలో “డియర్ కామ్రేడ్” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విజయ్ ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు దర్శకుడు క్రాంతి మాధవ్ తో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.
ఇక ఆ తర్వాత వెంకీ అట్లూరితో సినిమా వస్తుంది అని సైతం వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇంట బిజీగా గడుపుతున్న విజయ్ మీడియాతో ముచ్చటిస్తున్న క్రమంలో మీరు పెద్ద దర్శకులతో చెయ్యరా అని అడగగానే. ఎందుకు చెయ్యని, కానీ ప్రస్తుతానికి ఎవరికీ వాళ్ళం బిజీగా ఉన్నాం, చిన్న దర్శకుడు, పెద్ద దర్శకులు ని కాదు, నాకు కదా నచ్చితే చేస్తాను అంటూ తేల్చేసాడు విజయ్.
అయితే ప్రస్తుతానికి కుర్ర దర్శకులతో హిట్స్ వస్తున్నాయి కనుక, పెద్ద దర్శకులతో పెద్దగా పని లేదు, అని, చిన్న దర్శకులతోనే చేస్తాను అన్నట్లుగా ఉన్నాడు విజయ్. కానీ వారుగా ఎదురు దెబ్బలు తగిలితే మాత్రం అప్పుడు సీనియర్ అండ్ హిట్ దర్శకులు కావాల్సి వస్తుంది విజయ్ కి..ఏది ఏమైనా అందరూ అందరితో సినిమాలు చేస్తేనే, ఇండస్ట్రీ బావుంటుంది.



