
ఒక్కోసారి ఒక్కొక్కరి సీజన్ నడుస్తుంటుందని అందరికీ తెలుసు. కనుక నెక్స్ట్ ఎపిసోడ్ ఎవరు.. ఎలా మొదలుపెడతారు? అని ఎదురు చూపులు తప్పవు.
జన నాయగన్ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కనుక చూడలేకపోతున్నాము కానీ సిఎం విజయ్ ఆ లోటు పూర్తిగా తీర్చేశారు. కనుక ప్రస్తుతానికి అటువైపు చూడాల్సిన అవసరం లేదనిపిస్తోంది.
కనుక ‘చిరంజీవి భాషలో పొరుగు రాష్ట్రం’వైపు ఓసారి చూస్తే అక్కడ కేటీఆర్, కవిత ఇద్దరూ వేర్వేరు స్థావరాల నుంచి రేవంత్ రెడ్డి మీద బాణాలు సందిస్తూ కనపడుతున్నారు.
జగన్‌ని అందరూ ఎప్పుడూ తప్పుగానే అర్థం చేసుకుంటారు కానీ అయన ఎందరికో స్పూర్తి కలిగిస్తారు. ఆ స్పూర్తితోనే హరీష్ రావు ‘ఈసారి మేము అధికారంలోకి వస్తే సిఎం రేవంత్ రెడ్డి మొదలుపెడ్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ని పక్కన పడేసి మళ్ళీ ఫార్మా సిటీ మొదలుపెడతామని” చెప్పారు. దటీజ్ అమరావతి స్పిరిట్!
కనుక ఇక్కడ నీతి ఏమిటంటే, ఒక ప్రభుత్వం మొదలు పెట్టిన పనులను మరొక ప్రభుత్వం కొనసాగించదు. పక్కనపడేసి మళ్ళీ మొదటి నుంచి అన్నీ మొదలుపెడుతుంది. అందుకు జనాలు తప్పు పట్టకూడదు. ప్రజా ధనం దుబారా చేస్తున్నారని ఎవరూ బాధపడకూడదు.
కానీ జనాలు ఇలా ఏదో ఓ యావలో కొట్టుకుపోతుంటే జగన్ చూస్తూ వదిలేయలేరు కదా?కనుక ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబు నాయుడుని చచ్చిపోవాలని శపించారు. దాంతో ఆయన అందరినీ తన కంట్రోల్లోకి తీసుకున్నాక మళ్ళీ మావిగన్ ప్యాలస్‌లోకి మాయం అయిపోయారు.
ఇలా చెప్పుకుంటూపోతే తెలుగు డైలీ సీరియల్ లేదా కొరియా వెబ్ సిరీస్‌లా ఎంతకాలమైనా ఇలా రాజకీయ కాలక్షేపం చేసేయోచ్చు. కనుక నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు… ఎవరిది.. ఎలా ఉంటుంది? అని ఎదురు చూడక తప్పదు.
Ramayana directed by Nitesh Tiwari has reportedly witnessed a major development regarding its distribution rights.…
Air India has expanded its premium airport services globally with the launch of its first-ever…