
విజయ్ దళపతి… సినిమాలలో చేసే సాహసాలను నిజజీవితంలో కూడా చేస్తున్నారా? అంటే అవుననే చెప్పాలి. తమిళనాడు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన దళపతికి ఇంతవరకు ‘జన నాయకుడు’ సినిమానే రిలీజ్ చేసుకోలేకపోయారు. రాజకీయాలలో సక్సస్ అవ్వాలంటే మాటలా?
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సాధారణ రాజకీయ నాయకులకే క్షణం తీరిక ఉండదు. అలాంటిది టీవీకే పార్టీ అధినేత విజయ్‌కి ఖాళీ ఉంటుందా? శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా అన్ని స్థానాలకు టీవీకే పోటీ చేస్తోంది. కనుక దళపతికి ప్రతీ క్షణం చాలా విలువైనదే.
కానీ కరూర్ సభలో తొక్కిసలాటలో 40మంది చనిపోవడంతో కేంద్రానికి అడ్డంగా దొరికిపోయారు. అప్పటి నుంచి సీబీఐ విచారణ పేరుతో ఢిల్లీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
ఈ కేసు వద్దనుకుంటే చాలా సులభమైన పరిష్కారం ఉంది. అదే.. బిజేపితో చేతులు కలిపి ఎన్డీయేలో చేరిపోవడం. అప్పుడు సీబీఐకి హటాత్తుగా ‘మెమొరీ లాస్’ వస్తుంది. ఈ కేసు గురించి మరిచిపోతుంది.
పైగా తమతో చేతులు కలిపితే దళపతికి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా అంగీకరిస్తామని బిజేపి పెద్దలు చెప్పారని టీవీకే పార్టీ కార్యదర్శి ఆదవ అర్జున్ నిన్నే ఓ సభలో చెప్పారు.
విజయ్ లక్ష్యం ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి కావడమే. అందుకు కేంద్రం అన్నివిధాల తోడ్పడేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నప్పుడు రాజకీయాలలో రాణించాలనుకునేవారు కాదనరు.
మొదటి ప్రయత్నంలోనే ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి కాగలిగితే, ఇక రాజకీయాలలో తిరుగు ఉండదు. ఆ తర్వాత బిజేపితో సెట్ అవలేకపోతే దానికి ‘రామ్ రామ్’ చెప్పేసి కేసీఆర్‌లాగ ఫామ్‌హౌసులో పడేవరకు తాపీగా కత్తులు దూసుకోవచ్చు.
కానీ విజయ్ దళపతి బిజేపితో పొత్తుకి ససేమిరా అంటున్నారు. అంటే సీబీఐ అనే పులిని నిద్రలేపి దాని నోట్లో తల పెట్టబోతున్నారన్న మాట!
ఈ ఎన్నికలలో టీవీకే పార్టీకి కేవలం 15 శాతం ఓట్లు మాత్రమే పడతాయని తాజా సర్వేలో తేలింది. కనుక ఒంటరిగా పోటీ చేస్తే ఎదురు దెబ్బలు, పరాభవాలు తప్ప ఒరిగేదేమీ ఉండబోదు. ఆ తర్వాత గెలిచిన కొద్దిపాటి ఎమ్మెల్యేలు కూడా చేజారిపోతే మళ్ళీ ఒంటరిగా మిగిలిపోతారు.
ఒకవేళ బొటాబొటి లేదా భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చినా అన్నాడీఎంకే-బిజేపి, డీఎంకే-కాంగ్రెస్ కూటములు ఆయన కొత్త కుర్చీ కింద మంట పెట్టకుండా ఉండవు. బొత్తిగా అనుభవం లేని కొత్త ముఖ్యమంత్రి ఆ మంటలు, సెగలు తట్టుకొని ఎక్కువ కాలం ఆ కుర్చీలో కూర్చోలేరు. విజయ్ దళపతి ఇవన్నీ బాగా ఆలోచించుకునే ఉంటారు లేదా చుట్టూ ఉన్నవారు చెప్పే ఉంటారు.
అసలు ఆయన సింగిల్ సింహంలా ఎందుకు పోరాడాలనుకుంటున్నారు? అంటే బహుశః తాను చేసిన హీరో పాత్రలలో నుంచి ఇంకా బయటకు రాకపోవడం వల్ల కావచ్చు. లేదా చుట్టూ భజన బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల కావచ్చు. టీవీకే పార్టీ గెలిచినా, ఓడినా ఆయనకి ఎదురుదెబ్బలు, నష్టం తప్పకపోవచ్చు.
కనుక తమిళనాడు రాజకీయాలలో టీవీకే పార్టీకి కేంద్ర ప్రభుత్వం స్మూత్ ల్యాండింగ్‌కి అవకాశం కల్పిస్తునప్పుడు, గాలిలో చక్కర్లు కొట్టడం అవసరమా?
Rajinikanth’s highly anticipated sequel Jailer 2, directed by Nelson Dilipkumar, recently completed its shooting schedule.…
Anju Kurian is serving major fashion inspiration with her latest sun-drenched ethnic look. Dressed in…