పాచికలు వేసింది సాయిరెడ్డే…మరి వేయించింది.?

Vijayasai Reddy on TDP BJP alliance split

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో జరిగిన 2014 ఎన్నికలకు టీడీపీ, బీజేపీ పొత్తులో ముందుకెళ్లాయి, వారిద్దరి రాజకీయ పొత్తుకు జనసేన తరుపున పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారు. అయితే ఆంధ్రప్రదేశ్ మనుగడకు అత్యంత కీలకంగా ఉన్న 2014 – 2019 మధ్య ఐదేళ్ల సమయాన్ని వైసీపీ తన రాజకీయ లబ్ది కోసం ఏవిధంగా వినియోగించిందో తెలుసుకునేందుకు నేడు సాయిరెడ్డి చేస్తున్న ప్రకటనలే సజీవ సాక్షాలుగా మారుతున్నాయి.

రాష్ట్ర విభజనతో గాయపడిన రాష్ట్రానికి కేంద్ర సహకారం ఎంత అవసరమో తెలిసిన అనుభవజ్ఞుడైన నేతగా బాబు బీజేపీ తో జతకట్టారు. అయితే ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన మిత్ర బంధం రెండేళ్లకే విడాకుల వరకు వెళ్ళింది. దీనితో కేంద్రంలో ఉన్న బీజేపీ ఏపీకి హక్కు గా రావాల్సిన ఆస్తులను, నిధులను సైతం కట్టడి చేస్తూ ఏపీ ప్రజల మీద రాజకీయ కక్ష సాధించింది.

ADVERTISEMENT

ఇటు రాష్ట్రంలో ఉన్న టీడీపీ కూడా బీజేపీ పెద్దల పై హద్దులు దాటి విమర్శలకు దిగారు. ఇలా ఒక్కటిగా ఎన్నికలకు వెళ్లిన ఈ రెండు పార్టీల నేతలు ఎన్నికలు జరిగిన రెండేళ్ళకే ఒకరిమీద ఒకరు కత్తులు దూసుకునే స్థాయికి వెళ్లిపోయారు. అయితే ఈ మొత్తం ప్రక్రియ వెనుక వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హస్తం ఉందని నేడు సాయి రెడ్డే స్వయానా ప్రకటించారు.

నాడు తానూ తెరవెనుక వేసిన రాజకీయ పాచికలు ఫలించాయి, దాని ఫలితమే 2016 – 2018 మధ్య ఎన్డీయే ప్రభుత్వంలో భాగమైన బీజేపీకి టీడీపీ కి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి, ఎన్డీయే నుంచి టీడీపీ ని విడదీసేందుకు తానూ ఎంతగానో శ్రమించానని, అందుకోసం చాల ప్రయోగాలే చేసానని, ఢిల్లీ కేంద్రంగా తెరవెనుక ఎంతో రాజకీయం నడిపానని, చివరికి సక్సెస్ కూడా అయ్యానని తిరుపతి సాక్షిగా విజయసాయిరెడ్డి ప్రకటించారు.

దీనితో 2019 ఎన్నికలకు ముందు నుంచి కూడా సింగల్ సింహం అంటూ ప్రచారం చేసుకుంటున్న వైసీపీ పార్టీకి బీజేపీ కి మధ్య అంతర్గత సంబంధాలు ఉన్నాయంటూ జరిగిన ఉహాగానాలకు నేటి సాయిరెడ్డి ప్రకటనలు అక్షర రూపం ఇచ్చినట్టయ్యింది. అయితే ఎన్డీయే నుంచి టీడీపీ ని విడదీసేందుకు పాచికలు వేసింది సాయిరెడ్డే అనేది స్పష్టమయ్యింది …మరి ఆయనతో ఆ పాచికలు వేయించింది.?

టీడీపీ తో పొత్తులో ఉన్న బీజేపీ ని విడదీసి నాడు వైసీపీ ఎంపీగా ఉన్న సాయిరెడ్డి ఎవరికీ రాజకీయ లబ్ది చేకూర్చినట్టు.? సాయిరెడ్డి పాచికలు ఫలించి బీజేపీ, టీడీపీ కి దూరమయ్యి 2019 లో ఎవరికీ దగ్గరయినట్టు.? సాయి రెడ్డి ఈ సక్సెస్ స్టోరీ వెనుక ఉన్న అసలైన రాజకీయ లబ్ధిదారుడు ఎవరు.? సింగల్ అంటూ బీజేపీ తో మింగిల్ అయిన ఆ పార్టీ ఏది.? ఆ నాయకుడు ఎవరు.?

ADVERTISEMENT
Latest Stories