ఇప్పుడు ఓకే..కానీ విడుదల తర్వాత ఏమవుతుందో?

Vinaya Vidheya Rama సంక్రాతి బరిలో నిలిచిన సినిమాలన్నీ వేటికి అవే తోపులుగా ఫీల్ అయిపోతున్నాయి. అందులో రజని తలైవా నుంచి…వెంకీ ఎఫ్-2 వరకూ వేటికవే సంక్రాతి విన్నర్ మేమే అన్న విధంగా ఫీల్ అయిపోతున్నాయి. కట్ చేస్తే సినిమా రిలీజ్ ముందు చూసుకుంటే అందరికన్నా “ఊపు” తెప్పించే రేంజ్ లో చెర్రీ వినయ విధేయ రామ ఉంది అని తెలుస్తుంది.

ఎక్కువమంది ఈ సినిమా కొనడానికే ఆసక్తి చూపారట. మరో పక్క ఎన్ఠీఆర్ సినిమా పై మంచి ఊపే ఉన్నా…బాలయ్య బాక్స్ ఆఫీస్ రేంజ్ పై కూడా ఆలోచన చేస్తున్నారు బయ్యర్స్. ఇక ఎఫ్-2 ఎలాగో గిలిగింతలు పెట్టే సినిమానే కనుక..రేస్ అన్న హడావిడి ఏమి లేకుండా సో సో…గ వెళ్ళిపోతుంది. ఇక పెట్టా ఎలాగూ తమిళ రీమేక్ కనుక లాస్ట్ ఆప్షన్ పెట్టాకి ఇస్తున్నారు బయ్యర్స్.

ADVERTISEMENT

అయితే మీరు ఏ సినిమా కొంటారు అని అడగగానే…మాస్ సినిమా కనుక…మినిమం గ్యారెంటీ ఉంటుంది అని చెర్రీ వినయ విధేయ రామానే కొనడానికి బయ్యర్స్ ఎక్కువగా ఇష్టపడినట్లు ట్రేడ్ చెబుతున్న మాట.

అయితే సినిమా ముందు హడావిడి ఓకే కానీ…సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి ఏంటి అనేదే అసలు మ్యాటర్. ఎందుకంటే బోయపాటి సినిమాల్లో ఇప్పటివరకూ ట్రైలర్ చూసి పెదవి విరిచిన సినిమా ఈ సినిమానే…మరో పక్క పాటలు వినసొంపుగా లేవు…అయితే చెర్రీ మార్కెట్…మరో పక్క బోయపాటి దర్శకత్వం పై నమ్మకం..అన్నీ వెరసి అన్నింటికన్నా చెర్రీ సినిమానే ఆసక్తిగా కొన్నారు బయ్యర్స్..

మరి ఎంత మాస్ సినిమా అయినా తేడా వస్తే…అంతా అస్సామే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి చూద్దాం ఎవరి అదృష్టం ఎలా ఉందో?

ADVERTISEMENT
Latest Stories