Telugu

అప్పుడు రెజ్లింగ్ ఛాంపియన్… ఇప్పుడు ఎమ్మెల్యే వినేష్ ఫోగట్‌

ఇటీవల పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు అత్యంత చేదు అనుభవం ఏదైనా ఉందంటే అది భారత్‌ రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడటమే.

ADVERTISEMENT

సెమీ ఫైనల్స్‌లో జపాన్ దేశానికి చెందిన ప్రపంచ ఛాంపియన్ సుసాకిని సైతం ఓడించి వినేష్ ఫోగట్‌ ఫైనల్స్‌లోకి దూసుకువెళ్ళారు. కానీ ఒలింపిక్స్‌ నిబందనల ప్రకారం వంద గ్రాములు అధిక బరువు ఉన్నందుకు ఆమెపై అనర్హత వేటు పడింది.

ఆ అదనపు బరువుని తగ్గించుకునేందుకు తనకు మరొక్క గంట సమయం ఇవ్వాలని ఆమె ఎంతగానో ప్రాధేయపడ్డారు. కానీ ఒలింపిక్స్‌ కమిటీ నిరాకరించింది. దాంతో ఫైనల్స్‌లో చేతికి అందబోయిన పతకం తృటిలో చేజారిపోయింది.

అప్పుడు ఆమె ఒక్కరే కన్నీరు కార్చలేదు… ఆమెతో పాటు యావత్ భారతీయులు కంట తడిపెట్టారు. ఆమె ఒలింపిక్స్‌ కమిటీకి, అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా అప్పీలు చేసుకున్నారు. కానీ ఆమె ప్రయత్నాలు ఫలించకపోవడంతో తీవ్ర నిరాశతో భారత్‌ తిరిగి వచ్చారు.

ఆమె భారత్‌ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ కుస్తీపై దృష్టి పెడతారనుకుంటే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరి, హరానాలోని జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా శాసనసభ ఎన్నికలలో పోటీ చేశారు.

ఈరోజూ వెలువడిన ఫలితాలలో ఆమె విజయం సాధించారు. ఆమె తన సమీప బీజేపీ ప్రత్యర్ధిపై సుమారు 6,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఆమె పారిస్‌ ఒలింపిక్స్‌లో గెలిచి ఓడినప్పటికీ, రాజకీయాలలో ప్రత్యర్ధులను చిత్తుచిత్తుగా ఓడించి గెలిచారు.

కానీ ఈసారి ఆమెను దురదృష్టం మరో రూపంలో వెంటాడింది. ఈ ఎన్నికలలో ఆమె విజయం సాధించి ఎమ్మెల్యే అయిన్నప్పటికీ కాంగ్రెస్‌ ఓడిపోబోతోంది. అదే… కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే, ఆమెకు క్రీడాశాఖ మంత్రి పదవి లభించి ఉండేదేమో?

కనుక అదృష్టం ఆమెతో ఇంకా దోబూచులాడుతున్నట్లే ఉంది. తాజా సమాచారం ప్రకారం హర్యానా శాసనసభలో మొత్తం 90 సీట్లు ఉండగా వాటిలో 47 స్థానాలలో బీజేపీ ఆధిక్యతలో దూసుకుపోతోంది. కనుక హర్యానాలో బీజేపీ ముచ్చటగా మూడోసారి మళ్ళీ అధికారంలోకి రాబోతోంది.

అయితే ఈసారి బీజేపీకి పెద్దగా మెజార్టీ లేదు కనుక వినేష్ ఫోగట్‌ కాస్త రాజకీయాలను కూడా ఒంట బట్టించుకుని బీజేపీలోకి మారితే మంత్రి పదవి సంపాదించుకునే అవకాశం ఉంది. లేకుంటే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసి ప్రతిపక్ష బెంచీలో కూర్చోవలసి ఉంటుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Netflix Under Fire: Why Pay for YouTube-Level Content?

Kamiya Jani has been a popular face on social media for her way of interacting…

15 minutes ago

Mass H-1B Layoffs at Fortinet?

A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…

3 hours ago