జై శ్రీ రామ్: ట్రెండ్ అవుతున్న కోహ్లీ.!

Virat Kohli Lord Shree Ram

సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న ఇండియా, సౌత్ ఆఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్ లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. గ్రౌండ్ లో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్ మాన్ కేశవ్ మహారాజ్ అడుగుపెట్టగానే వెనుక బ్యాక్ గ్రౌండ్ లో “రామ్..సియా రామ్…”అంటూ ఆదిపురుష్ సినిమాలో రాముడి పాట ప్లే చేశారు.

ADVERTISEMENT

దానితో ఫిల్డింగ్ లో ఉన్న కింగ్ కోహ్లీ అందరి ద్రుష్టిని తన వైపు తిప్పుకునేలా చేశారు. పాట ప్లే అవుతున్న సమయంలో దండం పెట్టి, విల్లు విరించినట్టు చేయడంతో స్టేడియంలో ఉన్న కెమెరాలన్నీ ఆ దృశ్యాన్ని తమ కెమెరా కళ్ళలో బందించాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సీతను వెతకడానికి శ్రీ రాముడు ఏడు సముద్రాలు దాటితే ఇప్పుడు “జై శ్రీ రామ్” నినాదం ఖండాంతరాలు దాటి సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్ క్రికెట్ స్టేడియం వరకు చేరింది.దీనితో ఇంతటి ఉన్నత స్థానాలను అధిరోహించినప్పటికీ కోహ్లీ హిందూ సనాతన ధర్మం పట్ల తన గౌరవాన్ని తెలియచేయడం ఈ తరం యువతకు ఆదర్శంగా నిలిచింది.

జనవరి 22 యూపీలో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరుగుతున్న ఇటువంటి సమయంలో ఈ ఘటన పక్క దేశాలలో చోటు చేసుకోవడం అటు భారత దేశానికి, రామ భక్తులకు గర్వకారణంగా నిలిచింది. అంతా రామమయం…ఈ జగమంతా రామమయం.., జై శ్రీ రామ్ అంటూ కోహ్లీ వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories