‘హీరోయిన్ల’తో ఉన్న ఇబ్బంది గురించి చెప్పిన ‘హీరో’

vishal-heroine sri divya-height-issues‘రాయుడు’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా తమిళ హీరో విశాల్ తన సహచర హీరోయిన్ల గురించి పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. ముఖ్యంగా తన ఎత్తుకు మ్యాచ్ అయ్యే హీరోయిన్లు దొరకడం కష్టమైపోతుందని ఆవేదన చెందిన విశాల్… తెలుగు భామ శ్రీదివ్య హైట్ తో మాత్రం తనకు ఇబ్బంది రాలేదని అభిప్రాయ పడ్డారు. కానీ, మా ఇద్దరిని ఒకే ఫ్రేంలో మ్యాచ్ చేయడానికి కెమెరామెన్ కు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు.

తను సింగిల్ ఫ్రేంలో ఉన్నపుడు ఎలాంటి డైలాగ్ అయినా యాపిల్ మొబైల్ ను ఎదురుగా పెట్టుకుని పూర్తి చేసేస్తానని, అయితే హీరోయిన్లతో కాంభినేషన్ సీన్లు ఉన్నప్పుడు మాత్రం కాస్త కష్టమవుతోందని విశాల్ పేర్కొన్నాడు. ఇప్పటివరకు తనతో నటించిన హీరోయిన్లలో హైట్ విషయంలో పెద్దగా ఇబ్బంది లేని హీరోయిన్లు శృతిహాసన్, రీమాసేన్ తోనని చెప్పిన విశాల్, వారిద్దరితో నటించడం సౌకర్యంగా ఉంటుందని అన్నారు. అయితే, తన ఎత్తుకు తగిన హీరోయిన్ కావాలని కోరడం కూడా అత్యాశేనని తన హీరోయిన్ వ్యధలను మీడియా వేదికగా వెల్లడించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories