బీజేపీలో చంద్రబాబు వ్యతిరేక వర్గం ఇప్పటికీ చంద్రబాబునే వ్యతిరేకిస్తూ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి కృష్ణా కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇంటిని అక్రమ కట్టడమని, దాన్ని తక్షణమే ఖాళీ చేయాలని ఆయన అన్నారు.
టీడీపీలో చంద్రబాబు, లోకేష్ తప్ప ఎవరు మిగలరని ఎద్దేవా చేశారు. టీడీపీ ఇక తెలుగు దొంగల పార్టీగా పేరు పొందిందని, చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని నిగ్గు తేల్చాలని స్పష్టం చేశారు.ఆ పార్టీకి చెందిన నేతలంతా తొందర్లోనే తీహార్ జైలుకు వెళ్లక తప్పదని అందుకే వారంతా హిందీ నేర్చుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు.
ఇప్పటికే టీడీపీ మిత్రపక్షమైన కాంగ్రెస్ నేతలు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారని గుర్తుచేశారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని కూడా ఆయన సమర్దించారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే వ్యతిరేకిస్తుంది. మరి ఆయన వారికి ఈ విషయం చెప్పి జగన్ ప్రభుత్వానికి మద్దతు కూడగట్టాలి కదా?
అదే విధంగా చంద్రబాబుది అక్రమ నిర్మాణం అనే ముందు అదే కృష్ణా కరకట్ట మీద ఉన్న బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు రంగరాజు గెస్ట్ హౌస్ ని స్వయంగా వారే కూల్చేసి ఆదర్శంగా నిలిస్తే మంచిది కదా. ఇవన్నీ పక్కన పెడితే పార్టీలో ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం మీడియా ముందు చెబితే అది ఆ పార్టీ వారికే నష్టం.





