‘విశ్వనాథ్ & సన్స్’ సినిమా రివ్యూ: సెకండాఫ్ లో మిస్సైన సన్ & ఎమోషన్!

Vishwanath & Sons Review Suriya

చిత్రం: విశ్వనాథ్ & సన్స్

M9 రేటింగ్: 2.5/5

ADVERTISEMENT

విడుదల తేదీ: ఆగస్ట్ 14, 2026

తారాగణం: సూర్య, మమిత బైజు, రాధిక శరత్ కుమార్, రవీనా తండన్, సునీల్ రెడ్డి తదితరులు

నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్ – ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ – శ్రీకార స్టూడియోస్

దర్శకత్వం: వెంకీ అట్లూరి

సంగీతం: జివి.ప్రకాష్ కుమార్

నిర్మాత: నాగవంశీ – సాయి సౌజన్య

ఛాయాగ్రహణం: నిమిష్ రవి

కూర్పు: నవీన్ నూలి

సూర్య తెలుగు స్ట్రయిట్ సినిమాగా మొదలై తర్వాత తమిళ సినిమాగా తెరకెక్కి.. చివరికి తమిళ డబ్బింగ్ సినిమాగా తెలుగులో విడుదలైంది “విశ్వనాథ్ & సన్స్”. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి ముందు నుండి మంచి పాజిటివ్ బజ్ ఉంది. మరి ఆ పాజిటివ్ బజ్ ని సినిమా రీచ్ అవ్వగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!

కథ:

రిచ్ & సక్సెస్ ఫుల్ విశ్వనాథ్ ఫ్యామిలీకి ఏకైక వారసుడు సంజయ్ విశ్వనాథ్ (సూర్య). అయితే.. సంజయ్ కి ఓ వారసుడు లేడని చాలా బాధపడుతుంటుంది తల్లి (రాధిక శరత్ కుమార్).

చిన్నప్పుడే తండ్రి వల్ల పెళ్లి మీద ఆసక్తి కోల్పోయిన సంజయ్.. తల్లి కోసం సరోగసీ ద్వారా ఓ బిడ్డకి జన్మనిచ్చి అమెరికా నుండి ఇంటికి తీసుకొస్తాడు సంజయ్. మొదట ఇష్టం లేకపోయినా ఒడిలో మనవడ్ని చూసిన ఆనందంలో సంతోషంగా స్వాగతిస్తుంది.

అంతా బాగానే అవుతుంది అనుకున్న తరుణంలో.. కొడుకు అభయ్ కి బోన్ మ్యారో ఆపరేషన్ చేయించాలని తెలుసుకొని.. సరోగసీ ద్వారా జన్మనిచ్చిన తల్లి మ్యాడీ (మమిత బైజు) దగ్గరకి వెళ్తాడు సంజయ్.

ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారాయి? సంజయ్ పై ఇష్టం పెంచుకున్న మ్యాడీ ప్రేమ గెలిచిందా? వంటి ప్రశ్నలకు సమాధానమే “విశ్వనాథ్ & సన్స్” చిత్రం.

నటీనటుల పనితీరు:

సూర్యని ఒక కంఫర్టబుల్ రోల్ లో చాలా సింపుల్ పెర్ఫార్మెన్స్ లో చూసి చాలా రోజులవుతుంది. సూర్య బాగా యాక్ట్ చేస్తాడు, పాత్రకి ప్రాణం పోస్తాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలోనూ అదే విధంగా చాలా నీట్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. సెకండాఫ్ లో వచ్చే ఒక ఎమోషనల్ సీన్ లో సూర్య పెర్ఫార్మెన్స్ కంటతడి పెట్టిస్తుంది.

మమిత బైజు ఈ సినిమాకి ఎనర్జీ యాడ్ చేసింది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ కానీ, ఆమె నటన కానీ సినిమాకి పాజిటివ్ వైబ్ ఇచ్చింది. ముఖ్యంగా రాధికతో ఆమె కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయ్యింది. రాధిక కూడా తల్లి పాత్రలో సినిమాకి మంచి వెయిట్ యాడ్ చేసింది. సునీల్ రెడ్డి, నాజర్, రవీనా తండన్ వంటి వారి పాత్రలు సింపుల్ గా ఉన్నాయి.

సాంకేతికవర్గం పనితీరు:

సూర్య స్టైలింగ్ & సినిమా మొత్తంలో కలర్ కాంబినేషన్ సెట్ చేసిన విధానం బాగుంది. ఎక్కడా మరీ బ్రైట్ కలర్స్ వాడకుండా సినిమాలో ఎమోషన్ తగ్గట్లుగా కలర్ కాంబినేషన్ ని కూడా టోన్ డౌన్ చేసారు. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ వర్క్ & కలరింగ్ & డిఐ సినిమా మూడ్ ని బాగా సెట్ చేసింది.

జీవి ప్రకాష్ సాంగ్స్ ఇంకాస్త వైబ్రెంట్ గా ఉంటే బాగుండేది. బటర్ ఫ్లై సాంగ్ తప్ప మరేదీ పెద్దగా ఎక్కలేదు. అయితే.. పాటల్లో సాహిత్యం మాత్రం పాత్రల తాలూకు భావాల్ని, సన్నివేశంలోని ఎమోషన్ ని బాగా ఎలివేట్ చేసింది.

ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండొచ్చు. నవీన్ నూలిని గత కొన్ని సినిమాల విషయంలో తిట్టడానికి ముఖ్యకారణమైన ట్రాన్సిషన్స్ విషయంలో నవీన్ తీసుకున్న కేర్ బాగుంది. దర్శకుడు వెంకీ అట్లూరి కీ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. సూర్య పాత్ర తాలుకు బిహేవియర్ & ఆటిట్యూడ్ ప్యాటర్న్ ని ఓపెనింగ్ సీన్ లోనే క్లియర్ కట్ గా ఎస్టాబ్లిష్ చేసాడు. అలాగే పెళ్లితో హీరో పాత్రకి ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది వివరించిన విధానం కూడా సెన్సిబుల్ గా ఉంది. ఇక రాధిక & మమిత మధ్య కెమిస్ట్రీని చాలా నీట్ గా రాసుకున్నాడు.

ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు అంతా బాగుంది అనుకుంటూ ఉండగా.. సెకండాఫ్ లో కీ ఎమోషన్ ను పక్కన పెట్టేశాడు. సినిమా మొదలైనప్పుడు ఉండే వారసుడు/కొడుకు సెకండాఫ్ లో కనిపించడు. అలాగే.. సినిమా గోల్ కూడా మారిపోతుంది. ఏజ్ గ్యాప్ అనే ఇష్యూ & హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా సైడ్ అయిపోతుంది. అందువల్ల సినిమా ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వెళ్తుంది అనేది అర్థం కాదు. చివర్లో వచ్చే ఎండింగ్ కూడా ఆడియన్స్ ను సాటిస్ఫై చేయడానికే అన్నట్లుగా ఉంటుంది కానీ.. అందులో ఎమోషన్ కనిపించదు. అందువల్ల.. దర్శకుడిగా-రైటర్ గా వెంకీ అట్లూరి ప్రేక్షకుల్ని అలరించాడు కానీ.. పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాడు.

విశ్లేషణ:

ఒక సినిమాలో నడిపించాలనుకున్న డ్రామా/ఎమోషన్ ఏంటి అనేది క్లియర్ గా ఉండాలి. ఒకవేళ ఆ గోల్ అనేది మారుతుంటే.. అది ఎందుకు మారింది? ఎలా మారింది? ఎక్కడ డైవర్షన్ తీసుకుంది అనే క్లారిటీ ఆడియన్స్ కి ఇవ్వాలి, వాళ్ళది ఫీల్ అవ్వాలి. “విశ్వనాథ్ & సన్స్” విషయంలో కొరవడింది ఆ ప్రాపర్ ఎమోషనల్ ట్రాన్సిషన్.

అందులోనూ సెకండాఫ్ లో వచ్చే ఎమోషన్స్ అన్నీ ఆల్రెడీ చాలా త్రివిక్రమ్ సినిమాల్లో, మరీ ముఖ్యంగా అత్తారింటికీ దారేదిలో చూసేసాం కదా అనే భావన కలుగుతుంది తప్పితే నవ్యతా భావాన్ని కలిగించదు. అందువల్ల “విశ్వనాథ్ & సన్స్” సినిమాగా ఎంటర్టైన్ చేస్తుంది కానీ.. ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే స్కోప్ ఇవ్వదు.

ఆ కారణంగా సినిమా పూర్తి స్థాయి సంతృప్తినివ్వదు. ఆ విషయంలో వెంకీ అట్లూరి ఇంకాస్త కేర్ తీసుకొని ఉండాల్సింది. అయినప్పటికీ.. సూర్య స్క్రీన్ ప్రెజన్స్, మమిత ఎనర్జీ, రాధిక పెద్దరికం, కొన్ని ఎమోషనల్ & ఫన్నీ సీన్స్ కోసం కచ్చితంగా థియేటర్లలో కుటుంబం మొత్తం కలిసి చూడాల్సిన సినిమాగా నిలుస్తుంది “విశ్వనాథ్ & సన్స్”.

ఓవరాల్ గా.. సెకండాఫ్ లో మిస్సైన సన్ & ఎమోషన్!

M9 రేటింగ్: 2.5/5

ADVERTISEMENT
Latest Stories