‘లోకనాయకుడు’ కమల్ హాసన్ స్వీయనిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన “విశ్వరూపం” సినిమాకు ఎంతటి ప్రజాధరణ లభించిందో తెలిసిందే. దీంతో ఈ సినిమా చివరిలో వేసిన సీక్వెల్ పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. కానీ విడుదల విషయంలో జరిగిన జాప్యం, ఈ సినిమా కధ,కధనాలపై ఏ విధంగా ప్రభావితం చూపిందో అన్న దానికి నిదర్శనమే “విశ్వరూపం 2” టాక్ గా తెలుస్తోంది.
[m9ad]
లేటుగా రిలీజ్ అయినా, ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన “విశ్వరూపం 2” సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. ముఖ్యంగా మెస్మరైజింగ్ గా ఉన్న ఫస్ట్ పార్ట్ ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళిన ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచిందన్న ఫస్ట్ టాక్ వెలువడుతోంది. క్లుప్తంగా చెప్పాలంటే… “ఎంతో ఆసక్తితో ప్రారంభమై తీవ్ర అనాసక్తితో ముగియడం” అనేది ఈ సినిమాపై ప్రేక్షకుల టాక్.
ఇందులో సంతోషించాల్సిన అంశం ఏమిటంటే… అనేక వాయిదాల తర్వాత నేడు ఖచ్చితంగా రిలీజ్ అవ్వడం. ఎందుకంటే కరుణానిధి మరణంతో ఈ సినిమా వాయిదా తధ్యం అన్న టాక్ వెలువడిన నేపధ్యంలో… వాటన్నింటిని అధిగమించి సినిమా విడుదలకు నోచుకోవడం కమల్ ఫ్యాన్స్ కు ఊరటనిచ్చే అంశం. కానీ అంచనాలను అందుకోవడంలో విఫలం కావడం నిరాశ చెందే విషయం.



