
ED Raids Avinash Reddy in Viveka Murder Case
మళ్ళీ చాలా కాలం తర్వాత వివేకా హత్య కేసులో చిన్న కదలిక వచ్చింది. ఈ హత్య కేసులో జరిగిన ఆర్ధికలావాదేవీలపై విచారణ జరుపుతున్న ఈడీ అధికారులు నేడు హైదరాబాద్‌లోని కోకాపేటలోని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో, అదే సమయంలో పులివెందులలోని అయన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఇళ్ళలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.
తొలిసారిగా ఈ కేసు నమోదు చేసి సీబీఐ దర్యాప్తు చేసినప్పుడే ఈ హత్య కోసం నాలుగు కోట్లు చేతులు మారాయనే విషయం బయటపడింది. కనుక అది ఎవరు సమకూర్చారు? ఎవరెవరికి ఎంతెంత పంచారు?వంటి ఆధారాలు ఈ కేసులో చాలా కీలకం. కనుక ఈడీ అధికారులు అవినాష్ రెడ్డితో సహా నిందితుల ఇళ్ళలో సోదాలు నిర్వహిస్తున్నారు.
అయితే 2019 ఎన్నికల సమయంలో హత్య కోసం జరిగిన ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి సాక్ష్యాధారాల కోసం ఏడేళ్ళ తర్వాత నిందితుల ఇళ్ళలో సోదాలు చేస్తే దొరుకుతాయా? వాటి కోసం సీబీఐ లేదా ఈడీ అధికారులు వస్తారని నిందితులు వాటిని భద్రంగా దాచిపెట్టి ఉంచుతారా?
వివేకాను గొడ్డలితో దారుణంగా హత్య చేసి బ్యాండేజీలు చుట్టి గుండెపోటుగా చిత్రీకరించాలని అతితెలివి ప్రదర్శించినవారు, ఇలాంటి సాక్ష్యాధారాలను ఇంట్లో దాచుకోరు కదా? మరెందుకీ సోదాలు?
అంటే ఈ సోదాలలో వివేకా హత్యకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఈడీ కనుగొనలేకపోయినా, ఈ కేసులో మళ్ళీ కదలికలు మొదలయ్యాయనే విషయం సూచించినట్లే భావించవచ్చు. ఈ కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని ఈ సోదాలు నిర్దారిస్తున్నట్లే ఉన్నాయి. కనుక వచ్చే ఎన్నికల నాటికి ఈ కేసు వైసీపీకి ఉచ్చులా బిగుసుకోబోతోందా?అని ఆలోచిస్తే చాలు.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఇళ్ళలో ఈడీ సోదాలు. మనీ లాండరింగ్, అనుమానాస్పద ఆర్ధిక లావాదేవీలు జరుపుతున్నట్లు ఈడీ అభియోగం.
ఒకేసారి 10 చోట్ల తనికీలు చేస్తున్న ఈడీ బృందాలు.#AP pic.twitter.com/0Jwesxhthr
— M9 NEWS (@M9News_) August 21, 2026
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…