Telugu

లోకేష్ : మాది గూగుల్ – మీది గొడ్డలి

నేడు విశాఖలోని తుర్లవాడ లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా AI గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ జరిగింది.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు వచ్చిన తరువాత అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు సాగుతుంది. అందులో భాగంగానే నేడు విశాఖ తీరంలో AI గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు జరుగుతుంది.

ADVERTISEMENT

అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఇక నుంచి విశాఖపట్నం ను ‘ఏఐ పట్నంగా’ పిలవాల్సిందే అంటూ కొనియాడారు. ఇక నారా లోకేష్ సైతం ఇప్పటి వరకు విశాఖ అంటే ‘ఉక్కు నగరం’ ఇక నుంచి విశాఖ అంటే ‘డేటా సిటీ’ అంటూ విశాఖ అభివృద్ధి గురించి వివరించారు.

ఈ నేపథ్యంలో ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ పార్టీకి ఊహించని కౌంటర్ ఇచ్చారు. “మాది గూగుల్ అయితే మీది గొడ్డలి” అంటూ నాటి వివేకా గొడ్డలి వేటు రక్త చరిత్రను మరోసారి తెరమీదకు తెచ్చారు. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అన్న పవన అన్న సినిమా డైలాగ్ మాదిరి ‘మాది గూగుల్ – మీది గొడ్డలి’ ‘బోథ్ ఆర్ నాట్ సేమ్ బ్రదర్’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు లోకేష్.

దీనితో పరోక్షంగా వైసీపీ పై లోకేష్ వేసిన పంచ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే జగన్ క్రెడిట్ చోరీ ప్రెస్ మీట్ల పై కూడా లోకేష్ తనదైన స్టైల్ లో వైసీపీ కి కౌంటర్ ఇచ్చారు. నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల పేరుతో విశాఖ కేంద్రంగా వైసీపీ ఆడిన జగన్నాటకం తో ఆ ప్రాంతానికి కలిగిన మేలిమి లేదు.

కానీ నేడు కూటమి ప్రభుత్వం ‘ఒకే రాష్ట్రం ఒకే రాజధాని’ ‘అభివృద్ధి వికేంద్రీకరణ’ అంటూ ఇచ్చిన నినాదం ఇటు రాజధానిగా అమరావతి కి పట్టాభిషేకం చేసింది, పార్లమెంట్ సాక్షిగా రాజధానికి చట్టబద్ధత లభించేలా చేసింది, ఇక అటు పారిశ్రామిక ప్రగతితో విశాఖను ఐటీ, AI పరిశ్రమల స్థాపన తో దేశం దృష్టిని ఆకర్షించేలా చేస్తుంది.

అయితే లోకేష్ ఇచ్చిన లాస్ట్ పంచ్ కి కౌంటర్ గా వైసీపీ ఏవిధమైన స్క్రిప్ట్ తో మీడియా ముందుకొస్తుందో.? వైసీపీ పై పడిన గొడ్డలి రక్తపు మరకలను తుడిచేందుకు ఎన్నిరకాల ప్రయత్నాలు చేస్తుందో చూడాలి..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Big Names Of South Politics Unavailable, But Why?

South Indian politics are often based on intense rivalries and conflicting duals. But the last…

18 minutes ago

Get Ready, YSRCP Starts Double Gameplay

YSR Congress is fighting for its existence in Andhra Pradesh after the resounding defeat in…

38 minutes ago