న్యాచురల్ స్టార్ నాని పుట్టిన రోజు సందర్భంగా అతని తదుపరి సినిమా ‘శ్యామ్ సింఘా రాయ్’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. నాని కొన్ని ఏళ్ల క్రిందటి బెంగాలీ స్టైల్ లో ఉన్నాడు. అతనిని వెనుక నుండి హీరోయిన్ గట్టిగా హత్తుకుంది. అయితే వెనుక ఉన్న హీరోయిన్ ఎవరో కూడా తెలియడం లేదు. నాని హెయిర్ స్టైల్ వేషధారణ 90ల లో కలకత్తా ఉండే వారిని పొలినట్టు ఉంది.
పోస్టర్ లోని మిగతా ప్రాపర్టీస్ కూడా ఆ విధంగానే ఉన్నాయి. చాలా సినిమాలలో నాని లుక్ లో ఏమాత్రం మార్పు ఉండటం లేదు. అసలు సినిమా ఫోటోలు చూస్తే ఏది ఏ సినిమా అనేది కూడా పోల్చలేని విధంగా ఉంటున్నాయి. ఈ తరుణంలో శ్యామ్ సింఘా రాయ్ గెట్ అప్ నాని నుండి ఆహ్వానించదగిన మార్పు అనే చెప్పుకోవాలి. దానికి తగట్టుగానే పోస్టర్ కు రెస్పాన్స్ కూడా అదిరిపోయింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోల్‌కతాలో జరుగుతోంది. ఈ భారీ షెడ్యూల్‌లో హీరో, ముగ్గురు హీరోయిన్లు సహా ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు. అక్కడ పలు కీలక సన్నివేశాలను తీస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమటం కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్. బోయనపల్లి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా ఒరిజినల్ స్టోరీని అందించారు. మెలోడీ సాంగ్స్ స్పెషలిస్ట్‌గా పేరుపొందిన మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ చేస్తున్నారు.
2021 లో మూడు చిత్రాలను లైన్ లో పెట్టాడు నాని. టక్ జగదీష్ విడుదల ఇప్పుడే కంఫర్మ్ కాగా… 2021లో ఆయన రెండవ చిత్రం శ్యామ్ సింఘా రాయ్ ఆగస్టులో విడుదల కానుంది. అలాగే.. అతని మరో చిత్రం అంటే సుందరానికి ని డిసెంబర్‌లో విడుదల చేసి సంవత్సరాన్ని పూర్తి చేస్తాడు. ఈ మూడు చిత్రాలతోనూ హిట్స్ ఇవ్వడం ద్వారా హాట్రిక్ కొట్టాలని నటుడు టార్గెట్ గా పెట్టుకున్నాడు.





