
అందరూ వైసీపి గెలుస్తుందా… లేక టిడిపి కూటమి గెలుస్తుందా? అనే ఆలోచిస్తున్నారు. అయితే జగన్ సృష్టించిన చట్టబద్దత, ఉద్యోగ భద్రత లేని వాలంటీర్లు మాత్రం తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. వారు ఎన్నికలకు దూరంగా ఉండాలని, సంక్షేమ పధకాలకు వారి సేవలను ఉపయోగించరాదని ఈసీ ఆదేశిస్తుందని బహుశః వైసీపి మేధావులు ఎవరూ ఊహించి ఉండరు.
కనుక ఎన్నికలలో వాలంటీర్ల సేవలను ఉపయోగించుకునేందుకు వారిని రాజీనామాలు చేయాలని తీవ్ర ఒత్తిడి చేశారు. రాజీనామాలు చేసి వైసీపి అభ్యర్ధుల కోసం పనిచేసిన వారినే మళ్ళీ తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలలోకి తీసుకుంటామని, రాజీనామాలు చేయనివారందరినీ తొలగించి ఇంటికి పంపేస్తామని వైసీపి నేతలు బెదిరించారు. వారి ఒత్తిళ్ళు భరించలేక కొన్ని వేలమంది వాలంటీర్లు రాజీనామాలు చేయగా మిగిలినవారు నేటికీ ఉద్యోగాలలో కొనసాగుతున్నారు.
వైసీపి మళ్ళీ అధికారంలోకి రాలేకపోతే దానిని నమ్ముకొని ఉద్యోగాలకు రాజీనామాలు చేసినవారు నష్టపోతారు . ఒకవేళ వైసీపి మళ్ళీ అధికారంలోకి వస్తే రాజీనామాలు చేయకుండా ఉన్నవారి ఉద్యోగాలు ఊడిపోతాయన్న మాట! అంటే వైసీపి వలన ఏదోవిదంగా వాలంటీర్లు నష్టపోతున్నారన్న మాట!
టిడిపి అధికారంలోకి వస్తే ఉద్యోగాలలో ఉన్న వాలంటీర్లకు జీతాలు పెంచి నెలకు రూ.10,000 ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ ఇంతకాలం వైసీపికి వీరవిధేయంగా పనిచేసిన వాలంటీర్లను టిడిపి నమ్మగలదా?
ఓ పక్క పార్టీలో లక్షల మంది టిడిపి, జనసేన కార్యకర్తలు ఉండగా వైసీపి విధేయులైన వాలంటీర్లను ఉద్యోగాలలో కొనసాగించాలని చంద్రబాబు నాయుడు అనుకున్నా టిడిపి, జనసేన నేతలు అంగీకరిస్తారా? అంటే అనుమానమే.
నామమాత్రపు జీతానికి 5 ఏళ్ళు వెట్టిచాకిరీ చేసి, వైసీపి నేతలతో నిత్యం అవమానాలు భరిస్తూ వైసీపి కోసం పనిచేస్తే చివరికి వారి భవిష్యత్ ఈవిదంగా ఆగమ్యగోచరంగా మారింది. అయితే వారి సమస్యకు పరిష్కారం లేదా? అంటే ఉంది.
జగన్ తన పార్టీ అవసరాల కోసం వాలంటీర్ వ్యవస్థను సృష్టించి 5 ఏళ్ళు పూర్తిగా వాడుకున్నారు కనుక ఇప్పుడు గెలిచినా, ఓడినా కూడా వాలంటీర్ల బాధ్యత పూర్తిగా ఆయనే తీసుకోవలసి ఉంటుంది. ఇదే వారి సమస్యకు ఏకైక పరిష్కారం.
కానీ తెలంగాణలో తనను నమ్ముకొని వెంట తిరిగినా వైసీపి నేతలని, కార్యకర్తలని జగన్ నడిరోడ్డున విడిచిపెట్టి ఆంధ్రాకు వచ్చేశారు. కనుక వాలంటీర్లను ఆదుకుంటామని టిడిపి ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది కనుక ఒకవేళ వైసీపి ఓడిపోతే వాలంటీర్లతో తమకు సంబంధం లేదని జగన్ చేతులు దులుపుకుపోకుండా ఉంటారా? వైసీపి, టిడిపి కూటమి రెండూ ఆదుకోకపోతే వాలంటీర్లు, వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి?
SS Rajamouli has conquered box-office records with larger-than-life storytelling. But there is one thing that…
Following the terrible failure of Toxic, Yash has still not announced his next solo lead…