విజయ విజయ్ దేవరకొండ ఆలపించిన ‘వాట్ ది వాట్ ది ఎఫ్… అమ్మాయంటేనే టఫ్ఫూ…’ పాటలోని లిరిక్స్ వివాదాస్పదంగా ఉన్న విషయం తెలిసిందే. ‘రాముడు గానీ ఇప్పుడు పుట్టి జంగిల్ కు పోదాం రా రమ్మంటే… సీతకు కాస్త సిరాకు లేచి సోలోగానే పొమ్మంటాదే…’ అని సీతారాములపై పాడగా, ‘యమపాశంతో యముడే వచ్చి నీ పెనిమిటి ప్రాణం తీస్తానంటే… నెట్ ఫ్లిక్స్ ఈ సావిత్రి, లేట్ ఏంటి అంటూ కుమ్మేస్తాదే’ అంటూ మహాపతివ్రత సావిత్రిపై రాసిన లిరిక్స్ వివాదాస్పదంగా మారాయి.
[m9ad]
నిజానికి ఈ పాట విన్న మొదటిసారే, అతి త్వరలోనే ఈ పాటలోని లిరిక్స్ చేంజ్ అవుతాయన్నది ఊహించినదే. అందుకు తగ్గట్లుగానే ఈ పాటను యూ ట్యూబ్ నుండి తొలగించారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన యూ ట్యూబ్ లింక్ పని చేయడం లేదు. తాము రాసిన లిరిక్స్ కొందరి మనోభావాలను దెబ్బతీసాయని తెలిసాయి గనుక, వాటిని సవరించి మళ్ళీ యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తామని లిరిక్స్ అందించిన శ్రీమణి స్పష్టం చేసారు.
ఈ పాట వివాదాస్పదం అవుతుందని విన్న ఎవరైనా ఇట్టే చెప్పేయవచ్చు. బహుశా రెండవ వర్షన్ ను కూడా ఇప్పటికే రెడీ చేసి ఉన్నారనేది ట్రేడ్ టాక్. హీరో విజయ్ దేవరకొండ పాడిన పాట కావడంతో, మరలా పాట పాడి యూ ట్యూబ్ లోకి అప్ లోడ్ చేయాలంటే వెంటనే జరిగే పని కాదు. ఏది ఏమైనా వివాదం పెద్దది కాకముందే చిత్ర యూనిట్ స్పందించిందని చెప్పాలి. అయితే ఒక్క రోజులోనే దిద్దిబాటు చర్యలు తీసుకోకపోతే, అసలు వివాదం లేకుండా లిరిక్స్ అందించి ఉండాల్సింది కదా… శ్రీమణి గారు..!



