
పల్లెటూర్లలో ఆడబిడ్డలను ఎంతో అపురూపంగా చూసుకుంటారు.
ఆడబడుచు కన్నీరు ఇంటికి అరిష్టం అని భావిస్తారు. ఊర్లలో ఎవరైనా ఆడబడుచును మోసం చేస్తే (ఆస్తి వ్యవహారాల్లో) అలాంటి వారిని దుర్మార్గంగా చూస్తారు.
సరే చిన్న చిన్న కుటుంబాలలో ఆ గొడవలు అటుంచితే… లక్షల కోట్ల కు పడగలెత్తిన వారు కూడా ఆడబడుచుని మోసం చెయ్యడం ఎంటి అని పల్లెల్లో చర్చ జరుగుతుంది.
లక్ష కోట్ల ఆస్తి జగన్ జీవిత కాలంలో ఖర్చు చెయ్యలేరు. అటువంటిది చెల్లెలు ను మోసం చేసి ఇంకా సంపదను పెంచుకోవాల్సిన అవసరం ఏంటి అని అంతా అనుకుంటున్నారు.
షర్మిల వైఎస్ ఆస్తులు అడగడం లేదు నేను సంపాదించిన ఆస్తులలో వాట అడుగుతుంది అనే వాదనను ప్రజలు ఒప్పుకోవడం లేదు. జగన్ ఆస్తులు వైఎస్ అధికారం, అంతకు ముందు ఆయన రాజకీయ ప్రాబల్యం వల్లే వచ్చాయి అని ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు.
జగన్ సొంత ఆస్తులు షర్మిల అడిగింది అనే దానిని, టర్మ్స్ బావున్నప్పుడు జగన్ కొంత ఇవ్వడానికి సిద్ధపడ్డారు అనే దానిని ప్రజలు నమ్మడం లేదు. అది వినడానికే నమ్మశక్యంగా లేదని అంటున్నారు.
అలా అని షర్మిల మీద విపరీతమైన సింపతీ ఉందా ప్రజలకు అంటే అది కూడా కాదు. షర్మిల ఫక్తు రాజకీయ నాయకురాలు అనే వారి అభిప్రాయం. అయితే షర్మిల జగన్ కోసం చాలా కష్టపడింది అనే దాంట్లో ఎవరికీ అనుమానం లేదు. అది షర్మిలకు ఈ ఎపిసోడ్ లో కలిసి వస్తుంది.
పైగా జగన్ తల్లి విజయలక్ష్మి షర్మిల వైపు ఉండటం… అలాగే జగన్ తల్లి మీద కూడా కేసు వెయ్యడం ప్రజలు హర్షించడం లేదు. ఈ విషయంలో జగన్ పై ప్రజలకు యావగింపు రావడానికి అది కూడా ప్రధాన కారణం.
ఎన్నికల ఓటమి తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ కు ఇది అత్యంత ఇబ్బందికర పరిస్థితి. ఈ విషయంలో జగన్ ఏమనుకుంటున్నారో తెలీదుగానీ రాజకీయంగా ఇది Biggest Self-Goal.
Legal గా కూడా కాస్త టైమ్ పట్టవచ్చు గానీ తీర్పు షర్మిలకు అనుకూలంగా వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అని లీగల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం.
Kamiya Jani has been a popular face on social media for her way of interacting…
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…