ఏజెంట్ ఆలస్యానికి బాధ్యులెవరు నష్టమెవరికి

Who is responsible for Akhil Akkineni Agent delay ఒక పెద్ద స్టార్ కుటుంబం నుంచి వచ్చిన హీరో మీద అభిమానులకు బోలెడు అంచనాలు ఉంటాయి. అది సహజం. అసలు వస్తాడో రాడో తెలియని అకీరానందన్ గురించి పవర్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవ్వడం సోషల్ మీడియాలో చూస్తుంటాం. ఎప్పుడు ఖచ్చితమైన ఎంట్రీ ఉంటుందో తెలియని మోక్షజ్ఞ కోసం అభిమానులు బాలయ్యని ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. అలాంటిది ఎనిమిదేళ్ల క్రితం చాలా బలమైన బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన యువ నటుడు ఈపాటికి టైర్ 2 రేంజ్ ని దాటేసి ఉండాలి. కానీ అఖిల్ పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది.

ఏజెంట్ ని చెక్కుతూనే ఉన్నారు. నెలలు ఏళ్ళవుతున్నాయి కానీ ఇప్పటికీ ఫలానా డేట్ కి రిలీజ్ చేస్తామని నిర్మాత ధైర్యంగా చెప్పలేదు. దర్శకుడు సురేందర్ రెడ్డి ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ స్పై డ్రామాని రూపొందిస్తున్నారు. కానీ మరీ స్పష్టత లేని ఇంత ఆలస్యాన్ని ఫ్యాన్స్ భరించలేకపోతున్నారు. వాళ్లకు అఖిల్ మీద బోలెడు నమ్మకం. నాగ చైతన్య మాస్ జానర్ లో ఫిట్ కాడని అర్థమైపోయింది. ఎన్ని హిట్లు కొట్టినా సాఫ్ట్ అండ్ ఎమోషనల్ జోన్ నుంచి బయటికి రాలేడు. ఊర మాస్ తనకు ఫిట్ కాదు.

ADVERTISEMENT

కానీ అఖిల్ కు సరైన సక్సెస్ వస్తే నాన్న నాగార్జున లాగా ఇంకొంత కాలం తర్వాత ఫాలోయింగ్ పెంచేసుకుంటాడనే అభిప్రాయం తొలినాళ్లలో ఉండేది. కానీ వరసగా ప్రేమకథలు చేయడం ఈ ఉద్దేశాన్ని కొంత దెబ్బ తీయగా ఏజెంట్ నిర్మాణంలో జరుగుతున్న విపరీతమైన జాప్యం సహనానికి పరీక్షగా మారింది. ఇవాళేదో యాక్షన్ మేకింగ్ అంటూ వదిలిన వీడియోలోనూ 2023 వేసవి అన్నారే తప్ప క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఇదేమైనా ఆర్ఆర్ఆర్, బాహుబలి లాగా విపరీతమైన విజువల్ ఎఫెక్ట్స్ డిమాండ్ చేసేదా అంటే అదీ కాదు.

ఒకవేళ మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లాగా సురేందర్ రెడ్డి కనివిని ఎరుగని రేంజ్ లో ఏజెంట్ ని తీర్చిదిద్దుతున్నాడేమో రిలీజయ్యాక చూస్తే కానీ చెప్పలేం. ఏది ఏమైనా ఈ లేట్ల పట్ల అఖిల్ ఇకపై సీరియస్ గా ప్లాన్ చేసుకోవాలి. 2015లో ఇండస్ట్రీకి వస్తే ఇప్పటిదాకా చేసింది కేవలం నాలుగు సినిమాలు. మంచి ఓపెనింగ్స్ వచ్చే మార్కెట్ ఉన్నప్పుడు దాన్ని వరస సినిమాలతో పెంచుకోవాలి తప్పించి ఇలా విపరీతమైన కాలయాపన చేయడం వల్ల పోటీలో వెనుకబడటం, అభిమానగణం క్రమంగా తగ్గడం లాంటి ప్రమాదాలు ఉంటాయి. మరి ఏజెంట్ ఇకనైనా జాగ్రత్తగా ఉండటం హై ఎమర్జెన్సీ.

ADVERTISEMENT
Latest Stories