బ్రిటిష్ కాలం నాటి పుస్తకాలు పవన్ ఎందుకు చదివారు?

why pawan kalyan reads old booksసాధారణంగా సినీ హీరోలకు కాస్త ఖాళీ సమయం చిక్కితే ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ కు వెళ్లిపోతుంటారు. లేదంటే ఎంజాయ్ మూడ్ లోకి షిఫ్ట్ అవుతారు. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? దీనికి సమాధానం పవనే చెప్పారు. “తనకు నచ్చినట్లుగా తానూ ఉంటూ, షేవింగ్ చేసుకోవడం, మేకప్ వేసుకోవడం వంటి వాటికి దూరంగా వర్తమాన రాజకీయ అంశాలపై అధ్యయనం చేస్తుంటానని, అంతకు మించి ఏమీ లేదని” అన్నారు.

“సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా ప్రారంభానికి ఓ ఆరు నెలల ముందు సమయం దొరికిందని, అప్పుడు తానూ భూసేకరణ, సమీకరణ వంటి అంశాలపై బ్రిటిష్ కాలం నాటి పుస్తకాలను కూడా చదివానని, అప్పుడు ఏం జరిగిందో తెలియదు కదా, అందుకని పూర్తి సమాచారం తెలుసుకుని మాట్లాడడం మంచిదని, భూ విషయాలకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసానని, ఏ అంశమైనా అలాగే చదువుతుంటానని” పవర్ స్టార్ చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories