Director Maruthi

బాహుబలితో తెలుగు సినిమా స్థాయి పెరగడంతో ఇక మిగిలిన తెలుగు దర్శకులు, హీరోలు కూడా రాజమౌళి వేసిన బాటలోనే నడుస్తూ ఒక్కో అడుగు ముందుకేస్తూ తెలుగు సినిమాను భారతీయ సినిమాలలో బాహుబలిగా నిలబెడుతున్నారు.

దీనికి పుష్ప తో సుక్కు, యానిమల్ తో సందీప్ వంగా, కల్కి తో నాగ అశ్విన్, సాహూ సినిమాతో సుజిత, హనుమాన్ తో ప్రశాంత్ వర్మ ఇలా అనుభువం కన్నా ఆత్మవిశ్వాసం ఉన్న దర్శకులకే మన తెలుగు హీరోలు కూడా అగ్రతాంబూలం అందిస్తున్నారు. ఇప్పుడు వీరి కోవలోకే వచ్చి చేరారు రాజాసాబ్ మారుతి.

Also Read – ఒకేసారి ముగ్గురి హీరోలకు బ్రేక్ ఇచ్చేలా ఉంది!

‘ఈ రోజుల్లో’ అనే ఒక యూత్ ఫుల్-కామెడీ ఎంటర్టైనర్ తో డెబ్యూ చేసిన దర్శకుడు ‘మారుతి’ తన టాలెంట్ ను నిరూపించుకోవడానికి అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. ఇక 2013 లో ఈయన దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమ కథ చిత్రం’ తో టాలీవుడ్ కు హారర్-కామెడీ అనే జోనర్ ను పరిచయం చేసారు. అయితే ఇది అటు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా నిర్మాతలకు మంచి లాభాలనే తెచ్చిపెట్టింది.

ఇక అటు పిమ్మట తన దర్శకత్వ శైలిలో కాస్త మార్పులు చేస్తూ హిట్లు అందుకున్నారు. హీరోకి పుట్టుకతోనే ఒక లోపం ఉన్నట్లు, ఆ లోపాన్ని సద్వినియోగించుకుని, ఆ లోపం తోనే స్టోరీ లో కామెడీ తో ప్రేక్షకులను మెప్పించటం లో బాగా సక్సెస్ అయ్యారు దర్శకుడు మారుతి.

Also Read – సైఫ్‌కి టాలీవుడ్‌ పరామర్శలు, ట్వీట్స్ లేవేంటి?

‘భలే భలే మగాడివోయ్,లో మతిమరుపు క్యారెక్టర్ తో నానికి, మహానుభావుడు మూవీ తో OCD తో ఇబ్బంది పడే క్యారెక్టర్ తో శర్వానంద్ ను ప్రేక్షకులకు చేరువ చేసి గతంలో డీగ్రేడె సినిమాలు తీసే దర్శకుడిగా తన మీద వచ్చిన ఆరోపణలకు చెక్ పెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ మనసు గెలుచుకున్నారు మారుతి.

ఇక ఆ మధ్యలో యంగ్ హీరోలతో తెరకెక్కించిన ‘లవర్స్, కొత్త జంట ఒక మోస్తరుగా ఆడినప్పటికీ సీనియర్ హీరో వెంకీ తో తీసిన ‘బాబు బంగారం’ ప్రేక్షకులను మెప్పించటంలో విఫలమయ్యింది. అయితే 2019 లో వచ్చిన ‘ప్రతి రోజు పండగే’ తో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత చేరువయ్యారు మారుతి. అయితే, ఆ తరువాత వచ్చిన ‘మంచి రోజులొచ్చాయి, పక్కా కమర్షియల్’ చిత్రాలు ప్లాప్ గా నిలిచాయి.

Also Read – ఐటి దాడులు జరుగకపోతేనే ఆశ్చర్యపడాలి

మరి ఇలాంటి కెరీర్- డైలెమా లో ఉన్న టైం లో మరలా తన సక్సెస్ ఫార్ములా అయిన హారర్-కామెడీ జోనర్ నే నమ్ముకున్నారు మారుతి. టాలీవుడ్, బాలీవుడ్ అని సంబంధం లేకుండా తన కల్ట్ ఫ్యాన్-బేస్ ను దేశం మొత్తం ఏర్పరుచుకున్న రెబెల్ స్టార్ ప్రభాస్ తో ‘రాజాసాబ్’ అంటూ వచ్చే ఏప్రిల్ 10 కు మన ముందుకు రానున్నారు.

అయితే, టాలీవుడ్ విశిష్టత పై ఎన్నో ప్రశంసలు వస్తున్న ఈ రోజుల్లో, కంటెంట్ ఉన్న సినిమాలను అందించటంలో ముందంజలో ఉంది టాలీవుడ్. అలాంటి ఇండస్ట్రీ నుండి పాన్-ఇండియా స్టార్ ‘ప్రభాస్’ వంటి భారీ ఫ్యాన్-బేస్ ఉన్న హీరో తో రానున్నారు మారుతి. మరి వీరికి ఇంతటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ను మునుపెన్నడూ డైరెక్ట్ చేసిన అనుభవం లేదు.

మరి రాజాసాబ్ సినిమాతో మారుతీ కెరీర్ ముందుకు వెళుతుందా లేక ప్రభాస్ కెరీర్ ను వెనకెక్కి నెడుతుందా అనేది చూడాలి. అయితే పాన్ ఇండియా వ్యాప్తంగా ఇంతటి క్రెజ్ తో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ మార్కెట్ ఉన్న డార్లింగ్ మారుతికి అవకాశం ఇవ్వడం అంటే అది ఆయన కెరీర్ కు ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.




మరి ప్రభాస్ ఇచ్చిన ఈ అవకాశాన్ని మారుతి సద్వినియోగం చేసుకోగలరా.? గతంలో కూడా రన్ రాజా రన్ అంటూ శర్వానంద్ వంటి చిన్న హీరో ని డైరెక్ట్ చేసిన అనుభవంతో ఉన్న సుజిత్ కు సాహూ తో పాన్ప్ర ఇండియా మూవీ కి అవకాశం ఇచ్చారు ప్రభాస్.