రజనీ – పవన్ చేతులు కలుపుతారా?

Will rajinikanth support pawan kalyan‘సూపర్ స్టార్’ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం దాదాపుగా ఖరారైన నేపధ్యంలో… అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలి ఉందన్న భావాలు సర్వత్రా వెలువడుతున్న నేపధ్యంలో… పొలిటికల్ వర్గాలు మరో ఆసక్తికర చర్చకు తెరలేపుతున్నాయి. తమిళనాట రజనీకాంత్ స్థాపించబోయే పార్టీ మరియు ఏపీలో పవన్ జనసేన పార్టీలు కలిసి పనిచేస్తాయన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

ADVERTISEMENT

తమిళనాడులో రజనీకాంత్ కు ప్రాణమిచ్చే అభిమానగణం ఎలా ఉందో, తెలుగు నాట పవన్ కు కూడా అదే స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరూ నిరాడంబరంగా ఉంటారని, సినిమాల ద్వారా పొందిన క్రేజ్ కంటే వ్యక్తిగత జీవితంతో సంపాదించుకున్న అభిమానగణమే ఎక్కువని, వీరిద్దరూ కలిస్తే తెలుగు, తమిళ రాష్ట్రాలను శాశించే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్, కోలీవుడ్ లలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

అదే జరిగితే… తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో తెలుగు ప్రజలు ప్రభావం చూపుతారని, అలాగే ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తమిళ ప్రజలు ప్రభావం చూపుతారన్న విశ్లేషణలు కూడా చేస్తున్నారు. వీరిద్దరూ కలిస్తే రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు మంచి జరుగుతుందని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఈ పొత్తు చర్చలు ప్రారంభం కావచ్చని కోలీవుడ్ వర్గాలలో బలమైన టాక్ వినపడుతోంది. తెలుగులో జనసేన, తమిళంలో మక్కల్ సేన (జనసేనే) కలిస్తే విజయం తధ్యమని జోస్యం చెబుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories