తనకు మూడు పెళ్ళిళ్ళు జరగడానికి గల కారణాన్ని నిడదవోలు బహిరంగ సభలో పవన్ తెలియజేయగా, ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తనతో ఉంటే సుఖం ఉండదని, తన ధోరణి వేరని, అందుకే తనకు మూడు పెళ్ళిళ్ళు అయ్యాయని… ఇందులో తన తప్పేం లేదన్నట్లుగా జనసేన అధినేత సంజాయిషీ ఇచ్చుకున్నారు.
[m9ad]
కానీ ఇటీవల రేణుదేశాయ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇందుకు విరుద్ధమన్న సంగతి తెలిసిందే. సామాజిక స్పృహ పవన్ కళ్యాణ్ కు మొదటి నుండి ఉందని, ఇందులో అతన్ని విమర్శించలేమని, అయితే తనతో ఉన్నపుడే మరో మహిళతో పిల్లల్ని కన్నారని, ఇంకా మీరే అర్ధం చేసుకోవాలంటూ స్పష్టంగా చెప్పుకొచ్చింది.
పవన్ – రేణు వినిపించిన రెండు అభిప్రాయాలు భిన్న ధృవాలుగా ఉన్నాయి. సమాజ పరంగానే పవన్ మంచివాడని కితాబు ఇవ్వడంతో, పవన్ ఏవయితే చెప్పుకోచ్చారో అవన్నీ రేణు స్వీకరించినట్లే భావించవచ్చు. అయినప్పటికీ మరి రేణుదేశాయ్ తో ఎందుకు విడిపోయారో అన్న విషయాన్ని నిజంగా చెప్పే ధైర్యం పవన్ కుందా?



