వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్…. టీజర్ కంటే బెటర్ కానీ

World Famous- Lover Trailer Talkవిజయ్ దేవరకొండ నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ కాసేపటి క్రితం విడుదల అయ్యింది. గతంలో విడుదలైన టీజర్ విజయ్ తన అర్జున్ రెడ్డి హ్యాంగ్ ఓవర్ నుండి బయటపడలేదు ఇంకా అనిపించింది. అయితే టీజర్ లోని లవ్ ట్రాక్స్ బట్టి సినిమాలో ఇంకా ఏదో ఉందనే చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

అయితే ట్రైలర్ లో చాలా పాత్రలు, ట్రాక్స్ చూపించినా కథ ఏంటో బయటపెట్టకుండా జాగ్రత్త పడ్డాడు. గనులలో పని చేసే క్యారెక్టర్ లవ్ ట్రాక్ మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునేలా ఉంది. డైలాగులు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే ఈ ట్రాక్స్ అన్నిటినీ కలిపి చక్కని కథని తయారు చెయ్యగలిగాడా అనేదాని పైనే సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటది.

ADVERTISEMENT

వరల్డ్ ఫేమస్ లవర్ ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రేమ నేపథ్యంలోనే ఈ చిత్రం వస్తుంది.. పైగా టైటిల్ కూడా వరల్డ్ ఫేమస్ లవర్ కాబట్టి లవర్స్ డే అయిన ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చెయ్యాలని నిర్ణయించారు నిర్మాతలు.

ఇది ఇలా ఉండగా 2018లో వచ్చిన గీత గోవిందం తరువాత విజయ్ కు సరైన హిట్ లేదు. టాక్సీవాలా ఒక మాదిరిగా ఆడిన విజయ్ నుండి ఆశించే రేంజ్ అయితే కాదు. దీనితో ఈ సినిమా మీద విజయ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. అయితే ఫిబ్రవరి లాంటి డల్ పీరియడ్ లో సినిమా విడుదల కావడం ప్రతికూలాంశం.

ADVERTISEMENT
Latest Stories