‘యాత్ర’కు అంత సీన్ ఉంటుందా?

Yatra YSR Biopic Updatesనందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న “యాత్ర” సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి విడుదల కానున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను సంక్రాంతికి ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే సంక్రాంతి బరిలో ఇప్పటికే మరో రెండు పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి.

రామ్ చరణ్ – బోయపాటిల సినిమా కూడా సంక్రాంతికే ముహూర్తం ఖరారు చేసుకోగా, వెంకీ – వరుణ్ ల ‘ఎఫ్ 2’ కూడా ఆ సమయానికి ఫిక్స్ చేసుకుంది. తాజాగా ఈ సినిమాలతో పాటు వైఎస్సార్ బయోపిక్ “యాత్ర” కూడా సంక్రాంతి సంబరాలలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే మూడు పెద్ద సినిమాలు బరిలో ఉండడంతో, ‘యాత్ర’కు అదే సమయంలో రిలీజ్ అయ్యే అవకాశం లభిస్తుందా? అన్నది ప్రశ్నార్ధకమే.

ADVERTISEMENT

మమ్ముట్టి డేట్స్ భారీ స్థాయిలో ప్రకటించడంతో షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోన్న మాట నిజమే. రిలీజ్ ఇంకా ఆరు నెలల సమయం ఉంది గనుక, సంక్రాంతి నాటికి మూవీ సిద్ధం కావడం తధ్యం. కానీ మూడు పెద్ద సినిమాల బరిలో ఆశించినన్నీ ధియేటర్లు లభిస్తాయా? అంటే అప్పుడు భంగపాటుకు గురికాక తప్పదు. అయితే దీనిని సాకుగా చూపించుకుని వైసీపీ రాజకీయం చేసే అవకాశం మాత్రం పుష్కలంగా లభిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories