వైరల్ : కునుకు తీసిన ఎమ్మెల్యే!

YCP MLA Sleeping in Assemblyఅసెంబ్లీ జరుగుతున్న సమయంలో ‘కునుకు’ తీయడం అనేది పరిపాలన మొదలుపెట్టిన 2019వ సంవత్సరం నుండి ఇప్పటివరకు అధికార పార్టీ నేతలకు పరిపాటిగా మారిపోయిన వైనం చాలా సందర్భాలలో వీడియోల సాక్షిగా వెలుగు చూశాయి.

పలు సందర్భాలలో అయితే ఏకంగా ముఖ్యమంత్రి వర్యులే ఏమరుపాటుగా కునుకు తీయడం అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. తాజాగా ఈ జాబితాలో తాను కూడా ఉన్నానంటూ మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని చేరారు.

ADVERTISEMENT

ఏపీకి అతి ముఖ్యమైన రాజధాని గురించి ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో వెనుకనే ఉన్న పేర్ని నాని నిద్రపోవడం టీవీలలో రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాష్ట్రానికి అతి ముఖ్యమైన విషయం వెల్లడిస్తున్న సమయంలో కూడా పేర్ని నాని ఇలా వ్యవహరిస్తున్నారంటే, రాజధాని పట్ల గానీ, ఏపీ అభివృద్ధి పట్ల గానీ నానికి ఉన్న చిత్తశుద్ధిని చాటిచెప్పడానికి నిదర్శనంగా ఈ వీడియోను కీర్తిస్తున్నారు

ADVERTISEMENT
Latest Stories