నిండు సభలో సాక్షిది తప్పని ఒప్పుకున్న సీఎం జగన్

YS Jagan admits sakshi mistakeసీఎం జగన్ ఏంటి? సొంత మీడియా సాక్షిది తప్పని ఒప్పుకోవడం ఏంటి? అనుకుంటున్నారా?అటువంటి అరుదైన సంఘటన ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకుంది. ఈరోజు శాసనసభలో గతంలో ప్రభుత్వం తెల్లకార్డు దారులకు సన్నబియ్యం ఇస్తామని ఆ తరువాత మాటమార్చారనే విషయాన్నీ ప్రతిపక్ష టీడీపీ లేవనెత్తింది.

ADVERTISEMENT

అయితే ప్రభుత్వం మాత్రం తాము నాణ్యమైన బియ్యం ఇస్తామని మాత్రమే చెప్పమని, సన్నబియ్యం ఇస్తామని చెప్పలేదని చెప్పుకొచ్చింది. ఈ తరుణంలో టీడీపీ ఎమ్మెల్యేలు సాక్షి పత్రికలో ఆ విషయాన్నీ ప్రముఖంగా ప్రచురించిన పేపర్ ప్రతులను సభకు చూపించారు. దీనితో ఖంగుతిన్న ముఖ్యమంత్రి జగన్ స్వయంగా సమాధానం చెప్పారు.

“సాక్షి ఏదో అధికార గజెట్ అన్నట్టు చెబుతున్నారు. నాణ్యమైన బియ్యం ఇస్తామని మాత్రమే మేము చెప్పం, సన్నబియ్యం ఇస్తామని చెప్పలేదు. సాక్షిలో తప్పుగా అర్ధం చేసుకుని ప్రింట్ చేశారు,” అంటూ కవర్ చేశారు ముఖ్యమంత్రి. ఏది ఏమైనా ముఖ్యమంత్రి తన సొంత మీడియా సంస్థను నిండు సభలో తప్పు పట్టేలా చేసింది టీడీపీ.

ఇది ఇలా ఉండగా ప్రభుత్వం మీద తప్పుడు రాస్తే కేసులు పెట్టె జీవో తెచ్చిన తరుణంలో సాక్షి మీద ఈ విషయంలో కేసు ఎప్పుడు పెడుతున్నారని సోషల్ మీడియాలో పలువురు ప్రభుత్వాన్ని ఎద్దేవా చెయ్యడం విశేషం. సన్నబియ్యం ఇవ్వాల్సి వస్తే రాష్ట్ర మీద ప్రతి ఏడాది 1000 కోట్లు అదనపు భారం పడుతుంది కాబట్టి ఆ ప్రతిపాదన విరమించుకున్నాం అని ప్రభుత్వం చెప్పి ఉంటే ఈ పరిస్థితి రాకపోయి ఉండేది.

ADVERTISEMENT
Latest Stories