అనవసరంగా వాటి జోలికి వెళ్ళామా అని జగన్ ఆలోచన

Center - YS Jagan - Andhra Pradesh faces threat of global arbitrationపవన, సౌర విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాల రద్దు విషయంలో జగన్ ప్రభుత్వం అభాసుపాలు అయ్యేలా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు వారించినా ముఖ్యమంత్రి వినకుండా రద్దుకే మొగ్గు చూపారు. అయితే దీనివల్ల కేంద్రం పై అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తుంది. విదేశీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ని ఈ విషయంగా అంతర్జాతీయ కోర్టులకు ఈడుస్తామని కేంద్రానికి చెప్పిందంట.

ఇదే క్రమంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇటువంటి చర్యలకు పాల్పడి దేశం పరువు తియ్యకుండా కేంద్రం ఒక చట్టం కూడా తెచ్చే పనిలో ఉంది. ఈ తరుణంలో జగన్ ప్రభుత్వం ఒత్తిడిలో పడింది. అంతర్జాతీయ కోర్టులకు వెళ్లాల్సి వస్తే పరువు పోతుందని ఇప్పుడు ఆలోచన చేస్తుంది. అదే సమయంలో వెనుకడుగు వేస్తే రాజకీయంగా దెబ్బ అని కూడా అనుకుంటుంది.

ADVERTISEMENT

గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ రేట్లకు పవన, సౌర విద్యుత్‌ కొనడం వల్ల భారీగా ప్రజల దానం వృధా అయిందని అధికారులతో చెప్పించి చంద్రబాబు మీద వ్యతిరేకత వచ్చేలా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ విషయంలో ప్రధానప్రతిపక్ష పార్టీదే పై చెయ్యి అని చెప్పుకోవాలి. టీడీపీకి బీజేపీకి ఉన్న విబేధాలు అందరికీ తెలిసినవే.

అటువంటిది కేంద్రమే అప్పటి ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇస్తే, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి సహజంగానే ఉండదు కదా? పైగా ఈ విషయంలో కోర్టులు కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నాయి. ఈ తరుణంలో అనవసరంగా ఆ విషయాన్నీ ముట్టుకున్నాం అని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories