Jagan Blue Media

అధికారం ఉన్నన్నాళ్ళు వైసీపీ ప్రభుత్వాన్ని భుజాన వేసుకుని జగన్ భజన చేసిన కొన్ని నీలి మీడియాలు పోలింగ్ తరువాత నుండి గేరు మార్చి ఫ్యాన్ కు వ్యతిరేఖ విశ్లేషణలు మొదలుపెట్టారు.

పోలింగ్ రోజు బ్యాలెట్ బాక్స్ లలో ఓటుతో ఇచ్చిన ప్రజా తీర్పు జూన్ 4 తరువాత బయటకు వెలువడనుంది. ఈ ఫలితాలు మూడు రాజకీయ పార్టీల భవిష్యత్తు తో పాటు రాష్ట్ర భవితవ్యాన్ని నిర్దారించనుంది. గెలుపు పై ఏ పార్టీ అంచనాలు ఆ పార్టీకి బలంగా ఉన్నప్పటికీ విజయం అనేది అమరావతికా..? విశాఖకా..? అనేది తేలాల్సి ఉంది.

Also Read – వారిద్దరి అహం ఖరీదు… రెండు రాష్ట్రాలు, రెండు పార్టీలు!

అయితే వైసీపీ నాయకులు మాత్రం జూన్ 9 న విశాఖలో ముఖ్యమంత్రి గా జగన్ రెండో సారి ప్రమాణస్వీకారం చేయనున్నారు అంటూ ఆ పార్టీ క్యాడర్ కు బూస్ట్ప్ ఇచ్చే ప్రకటనలు చేస్తూ అక్కడితో సంతృప్తి చెందక జగన్ ప్రమాణస్వీకార మహోత్సవానికి ప్రజలు తండోపతండాలుగా విశాఖకు చేరుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు ఊదరకొడుతున్నారు.

జూన్ 9 కి విశాఖకు వచ్చే అన్ని ట్రాన్స్ ఫోర్టేషన్లు, విశాఖ హోటల్స్ అన్ని జనాలతో ఫుల్ అయిపోయాయని సోషల్ మీడియాలో ఎక్కడ లేని హడావుడి చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. అయితే జూన్ 4 ఫలితాల విడుదల తరువాత ఇటువంటి వార్తలు ప్రచారం చేసినా, లేక వైసీపీ నాయకులు ఈ ప్రచారాలను ప్రమోషన్ చేసినా ఎవ్వరు దానిని తప్పుపట్టారు.

Also Read – కేటీఆర్‌కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆదర్శమట!

కానీ ఫలితాలకు ముందే విశాఖే రాజధాని, అక్కడే మా ప్రమాణ స్వీకారం, విశాఖ జనసంద్రం కాబోతుంది, రైళ్లన్నీ బ్లూ మయం, బస్సులన్నీ వైట్ మయం, రోడ్లన్నీ గ్రీన్ మయం అంటూ ఇప్పుడే వైసీపీ పార్టీ జెండా రంగులతో గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ చూపిస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా. అయితే వైసీపీ నేతలు చెపుతున్నట్టుగా జూన్ 8 కి ఒక్క టికెట్ కూడా బుక్ కాలేదనేది వాస్తవం.

ఇప్పటికే దాదాపు కూటమి గెలుపు ఖరారంటూ విస్తృతంగా మౌత్ టాక్ ప్రచారంలో ఉన్నప్పటికీ టీడీపీ కానీ జనసేన కానీ ఇటువంటి ముందస్తు ప్రకటనలకు ఆసక్తి చూపడం లేదు. వైసీపీ నేతలు మాత్రం ఎక్కడా తగ్గేదిలేదు అనేలా పార్టీ క్యాడర్ లో అలుముకున్న ఓటమి భయాన్ని తరిమికొట్టడానికో, లేక కౌంటింగ్ రోజు క్యాడర్లో ధైర్యాన్ని నింపడానికో ముందస్తు హడావుడి చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కు అవకాశం ఇస్తుంది.

Also Read – న్యూటన్స్ లా: అర్థమైందా రాజా..!

అయితే వైసీపీ చేస్తున్న ఈ అత్యుత్సాన్ని కూటమి మద్దతుదారులు కాదు వైసీపీ మద్దతుదారులు సైతం తప్పుబడుతున్నారు. అలాగే ఈ ప్రచారాలను తప్పుపడుతూ బ్లూ మీడియా కూడా కథనాలు ప్రచురిస్తుంది. ఫలితాలకు ముందు ఈ ఓవర్ యాక్షన్ వైసీపీ నేతలకు అవసరమా..? అంటూ విశ్లేషణలు మొదలయ్యాయి. వైసీపీ అనుకూల మీడియా వారే వైసీపీ నేతలు చేస్తున్న అతిని ఎత్తి చూపుతున్నా ఆ పార్టీ సోషల్ మీడియా మాత్రం నిసిగ్గుగా ఇటువంటి ప్రచారాలకే మొగ్గు చూపుతుంది.

ఇన్నాళ్ళుగా వైసీపీ కి వ్యతిరేకంగా కథనాలు ప్రచురించిన, విశ్లేషణలు చేసినా దానిని బాబు ప్యాకేజీ టీం కింద అభివర్ణించి జగన్ గారు ఇప్పుడు సొంత అనుకూల మద్దతుదారులే గెలుపు మీద నమ్మకం లేదు దొర…కాస్త ఓపిక పట్టండి అంటూ ఆర్తనాదాలు చేస్తున్నా వినిపించుకునే పరిస్థితులలో వైసీపీ లేకపోవడం వైసీపీ వ్యతిరేఖ సోషల్ మీడియాకు పనిపెట్టినట్టయింది మరి జూన్ 4 తరువాత జగన్ ఎవరికీ పని కల్పిస్తారో ఎవరి నోటికి తాళం వేస్తారో చూడాలి.