హైదరాబాద్ లో తన కొత్త ఇంటిలోకి వెళ్ళిన చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ జగన్ మీడియా ‘సాక్షి’ పుంకాలుపుంకాలుగా కధనాలు రాస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో మరే సమస్య లేనట్లు… చంద్రబాబు ఇల్లు కట్టుకోవడమే రాష్ట్రానికి ప్రధాన సమస్య అన్నట్లుగా రాస్తున్న సాక్షి కధనాలకు టిడిపి వర్గాలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. వీరిద్దరి ఆధిపత్య పోరులో… మరోసారి జగన్ ఇంటి వ్యవహారం గురించి కూడా వైసీపీ వర్గీయులు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది.
‘తను తీసిన గోతిలో తనే పడ్డట్లయినట్లుగా’ మారిన ఈ వ్యవహారంలో… జగన్ 70 గదుల ఇంట్లో కేవలం 4 సభ్యులు మాత్రమే ఉండడం హైలైట్ అయ్యింది. దీంతో డిఫెన్సులో పడ్డ వైసీపీ నేతలు, ‘జగన్ ఇంటికి నిత్యం వేలాది మంది కార్యకర్తలు వస్తూ ఉంటారని’ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. చంద్రబాబు – జగన్ ల ఇంటికి సంబంధించిన తేడాలను వివరిస్తూ… సోషల్ మీడియాలో ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. ఇందులో చంద్రబాబు కొత్త ఇంటికి, జగన్ ఇంటికి వివరాలు స్పష్టంగా ఉండడంతో… ఇది కాస్త వైరల్ గా మారింది.
జగన్ ఇల్లు 70 గదులతో ఉన్నది అన్న విషయం తెలిసిందే గానీ, అందులో రెండు హెలీ ప్యాడ్ లు, రెండు మినీ ధియేటర్లు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదు. అలాగే ఓ చిన్న పల్లెటూరు మొత్తానికి సరిపోయే విధంగా జగన్ ఇల్లు ఉందన్న విషయం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు ఇంటిని టార్గెట్ చేద్దామని భావించిన జగన్ పన్నిన ఎత్తుగడ ‘బూమ్ రాంగ్’ కావడం, మరోసారి పరిపక్వత లేని రాజకీయాలను సూచిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.



