కుల, మత వివాదాలపై జగన్ వ్యాఖ్య… చేసిందంతా చేసి తెలివిగా మాట్లాడుతున్నారా?

YS Jagan Mohan Reddy on his religion-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపటి క్రితం గుంటూరులో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఆ సభలో జగన్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇవాళ రకరకాల ఆరోపణల మధ్య రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నాం. మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతుంటే జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ మధ్య కాలంలో నా మతం, కులం గురించి కూడా మాట్లాడారు. దానికి నాకు చాలా బాధ అనిపించింది,” అన్నారు.

“నా మతం మానవత్వం. ఈ వేదికగా చెబుతున్నా… నా కులం మాట నిలబెట్టుకునే కులం,” అని జగన్ చెప్పుకొచ్చారు. అయితే జగన్ చెప్పింది బానే ఉంది. అయితే కులం, మతం ఆధారంగా వివాదాలు రావడానికి కారణం ఎవరు? ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టులలో దాదాపుగా 80-85% జగన్ కులం వారికి అన్నది తెలిసిందే కదా?

ADVERTISEMENT

మతం మీద వివాదాలు వస్తాయి అన్నప్పుడు జాగ్రత్త పడి ఉండాల్సింది. జగన్ పాలనలో మతప్రచారం, మతమార్పిడులు పెరిగాయి అనేది అంతటా ఉన్న ఫీలింగ్… దానికి తగ్గట్టు అనేక ఉందంతాలు బయటపడుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా టీటీడీపై కూడా అనేక వివాదాలు వస్తున్నాయి.

సరే ఇవి పక్కన పెడితే గతంలో మతం, కులం పేరిట జగన్ రాజకీయాలు చెయ్యలేదా? అసలు లేదు అని ఇప్పుడు టీటీడీ చెబుతున్న పింక్ డైమండ్ పోయిందంటూ టీటీడీ ప్రధాన అర్చకుడితో ఆరోపణలు చేయించి శ్రీవారి ఆభరణాలు చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని విజయసాయి రెడ్డితో అనిపించలేదు. 33 మంది కమ్మ డీఎస్పీలు ఉన్నారంటూ జగన్ ఢిల్లీ వెళ్లి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చెయ్యలేదు. నిజానికి అప్పట్లో కమ్మ డీఎస్పీలు ఉన్నదీ ఐదారుగురే. ఇప్పుడు పడిన బాధ అప్పుడు గుర్తు వచ్చి ఉంటే బావుండేది.

ADVERTISEMENT
Latest Stories