సలహాదారుల్లారా… జీతాలు తీసుకుంటున్నారుగా… సలహాలు ఇవ్వరా?

YS Jagan Sajjala Ramakrishna Reddy YS Sharmila Arrest

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకొని కేసీఆర్‌ని, ఆయన ప్రభుత్వాన్ని ఎంతగా విమర్శించినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తెలంగాణలో ఆమె ఎంత హడావుడి చేసినా కేసీఆర్‌ ప్రభుత్వం అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించలేదు. ఓసారి ఎప్పుడో మొక్కుబడిగా చేసి విడిచిపెట్టేశారు. ఆమెను అక్కడ ఎవరూ ఎందుకు పట్టించుకోలేదో కారణాలు అందరికీ తెలుసు.

కానీ అదే వైఎస్ షర్మిల ఏపీలో వాలిపోయి తన అన్న, సిఎం జగన్మోహన్‌ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ఆమెను అరెస్ట్ చేసే ఆలోచన చేయలేదు. కానీ ఆమె ఏపీలో అడుగుపెట్టిన్న రెండు నెలలకే జగన్మోహన్‌ రెడ్డి నిన్న చెల్లిని అరెస్ట్ చేయించారు.

ADVERTISEMENT

మన దేశంలో సొంత చెల్లిని అరెస్ట్ చేయించిన ఘనత బహుశః జగన్మోహన్‌ రెడ్డి ఒక్కరికే దక్కి ఉండవచ్చు. అయితే ఆమెను చెల్లిగా కాకుండా ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా, ప్రతిపక్ష నేతగా మాత్రమే చూస్తున్నామని వైసీపి నేతలు సమర్ధించుకోవచ్చు. కానీ ప్రజలు మాత్రం చెల్లిని అన్న అరెస్ట్ చేయడంగానే చూస్తారని వేరే చెప్పక్కరలేదు.

ఈ ప్రభావం ప్రజలపై ముఖ్యంగా… మహిళా ఓటర్లపై చాలా తీవ్రంగా పడుతుందనే విషయం సలహాదారులు ఎవరూ జగన్‌కు చెప్పిన్నట్లు లేదు. వారు చెప్పకపోతే ‘ఐప్యాక్ టీమ్’ చెప్పి ఉండాలి. వారైనా చెప్తారో లేదో… చెప్పినా జగన్‌ వింటారో లేదో తెలీదు.

కానీ తనను అరెస్ట్ చేస్తే ఆ ప్రభావం ప్రజలపై ఏవిదంగా పడుతుందో వైఎస్ షర్మిలకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇదీగాక ఏపీలో అందరి దృష్టి ఆకర్షించాలంటే ఇలాంటి హడావుడి చేయక తప్పదు. కనుక ఆమె మళ్ళీ ఏదో కారణంతో హడావుడి చేస్తూ అరెస్ట్ అయ్యేందుకు ప్రయత్నించడం ఖాయమే.

కనుక ఆమె చేస్తున్న విమర్శలకు వైసీపి నేతలు సమాధానాలు చెప్పుకుంటే సరిపోదు. మళ్ళీ ఆమెను అరెస్ట్ చేయకుండా ఏవిదంగా కట్టడి చేయాలో వైసీపి మేధావులు ఆలోచించుకోవలసి ఉంటుంది. లేకుంటే వైఎస్ షర్మిలని అరెస్టు చేసిన ప్రతీసారి జగన్‌, వైసీపిల గ్రాఫ్ పడిపోతూనే ఉంటుంది. మరి లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటున్న సలహాదారులు జగన్‌కు ఏం సలహా చెప్తారో?

ADVERTISEMENT
Latest Stories