
టిడిపి-జనసేన, టిడిపి-బీజేపీ పొత్తులు పెట్టుకొంటున్నప్పుడు అందరి కంటే ఎక్కువ ఆక్రోశించింది వైసీపి దాని ఆత్మసాక్షే.
టిడిపి, జనసేనల పొత్తుల విషయంలో నేరుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను అవహేళన చేసిన జగన్ బ్యాచ్, టిడిపి-బీజేపీ పొత్తులు పెట్టుకొంటున్నప్పుడు మాత్రం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని టార్గెట్ చేసింది తప్ప మోడీ, అమిత్ షాల జోలికి పోలేదు.
‘జాతీయ రాజకీయాలలో ఉద్దండులైన వారిద్దరూ అమాయకంగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో చిక్కుకున్నారు’ అని మాత్రమే సున్నితంగా తన ఆవేదనని, అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది తప్ప అంతకు మించి ఒక్క ముక్క అనలేదు.
సరే… జగన్మోహన్ రెడ్డి ఏపీని ఏలెందుకు పుట్టిన దైవాంశ సంభూతుడే కావచ్చు లేదా ఆయనకు ఆ దేవుడే తోడుగా ఉండి ఉండవచ్చు. కానీ జగన్ ఒకటి కోరుకుంటే మరొకటి జరగడం ఏమిటి? టిడిపి, జనసేన, బీజేపీల పొత్తులే ఇందుకు నిదర్శనం.
జగన్ ఎలాగూ మోడీ, అమిత్ షాలను విమర్శించే సాహసం చేయలేరు కనుక టిడిపి, జనసేనల మ్యానిఫెస్టోపై ప్రధాని మోడీ బొమ్మ లేదనే పాయింట్ పట్టుకొని ట్రై చేశారు. కానీ అది కూడా గులక రాయి డ్రామాలాగే వర్కవుట్ కాలేదు. ఇంతకీ పైనున్న ఆ దేవుడు కిందకు చూస్తున్నాడో…లేదో అని డౌట్ కలుగుతోంది.
సరే… టిడిపి, జనసేన, బీజేపీల పొత్తులను ఆ దేవుడు కూడా అడ్డుకోలేదు. కనుక సిద్దం సభలలోనైనా ‘ఏపీకి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వం ఏమి చేశారని’ జగన్ గట్టిగా అడగలేకపోతున్నారు!
జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాల గురించి మోడీని ప్రశ్నిస్తున్నారు కానీ జగన్ నోట ప్రధాని మోడీ పేరు కూడా వినబడటం లేదు. ఒకవేళ కేంద్ర ఎన్నికల కమీషన్ సిద్దం సభలలో మోడీ పేరుని ప్రస్తావించడంపై ఏమైనా నిషేధం విదించిందా అనే అనుమానం కలుగుతోంది.
ప్రత్యర్ధి పార్టీల కూటమిలో రెంటినీ జగన్, వైసీపి నేతలు నోటికి వచ్చిన్నట్లు దూషిస్తూ, విమర్శిస్తూ, అవహేళన చేస్తూ, మూడో పార్టీ గురించి మాట్లాడకపోవడం గమనిస్తే ‘అండర్ స్టాండింగ్’ ‘కామన్ సెన్స్’ బాగానే ఉందని అర్దమవుతోంది.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…