మంగళవారం ఫలితమే.., బుధవారం ప్రకటన..!

Sharmila on Unemployed Youth in Telangana“ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని, ఇది తెలంగాణ యువతకు మా ప్రభుత్వం ఇచ్చే బహుమతి అని” అసెంబ్లీ సమావేశాలలో సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు తీపి కబురు అందించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పెద్దలు బుధవారం నాడు జబ్బలు చరుచుకొంటూ మరీ ప్రకటన చేస్తే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఈ ప్రకటన మా పోరాటాల ఫలితమే అని క్రెడిట్ దక్కించుకునే పనిలో పడ్డాయి.

తెలంగాణాలో అధికార పార్టీని దీటుగా ఎదుర్కొంటున్న బీజేపీ – కాంగ్రెస్ లు పార్టీలు తమ పోరాటాల ఫలితమే ఇప్పుడు ఈ జాబ్ మేళ అని చెప్పడంలో కొంతవరకు ఆశ్చర్యం లేదు కాని, అసలు ఒక రాజకీయ పార్టీగా కనీస గుర్తింపు లేని వైస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల, ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ తమ పోరాటాల ఫలితమేనని భావించడమే ఇక్కడ కొసమెరుపు అని వ్యంగ్యంగా విమర్శిస్తున్నారు నెటిజన్లు.

ADVERTISEMENT

అసలు షర్మిల చెప్పిందేమిటంటే… ప్రతి మంగళవారం “నిరుద్యోగ – నిరాహార దీక్ష” అని మేము చేసిన పోరాటాల వల్లనే కేసీఆర్ దిగ్గొచ్చారని., పోరాటాల ఫలితంగానే ఏదైనా సాధించుకోగలమని మరోసారి రుజువుచేశామని అభిప్రాయపడ్డారు. షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలపై ఇతర పార్టీ నేతలు మండిపడుతున్నారు.

“జగన్ వదిలిన బాణం” షర్మిల అని., తన ప్రచారాలను ఆంధ్ర వరకే పరిమితం చేసుకోవాలని తోటి రాజకీయ పార్టీలు సూచనలు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం వదిలిన షర్మిల బాణాన్ని స్వయంగా జగనే ఎన్నికలు ముగిసే నాటికే విరిచేసారని, అందుకే ఇప్పుడు చెల్లెలు తెలంగాణాలో మంగళవారం దీక్షలు మొదలు పెట్టిందని కొంత ఘాటుగానే అధికార – ప్రతిపక్ష పార్టీలు బదులిస్తూ వచ్చాయి.

అయినా ‘అన్న – చెల్లి’కి ఈ వారాల సెంటిమెంట్ ఏమిటో అర్ధం కావడం లేదని సోషల్ మీడియాలో ఛలోక్తులు వేస్తున్నారు. షర్మిలకు మంగళవారం కాగా, సోదరుడు జగన్ రోజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో! ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాలో కూడా ఈ వారంపై పరోక్షంగా డైలాగ్ లు వేసారన్నది నెటిజన్ల ఆంతర్యం.

ADVERTISEMENT
Latest Stories