షర్మిల జగన్ కు కనీసం ఆ సంతోషమైన మిగిల్చింది…. సంతోషం!

ys sharmila radhakrishna interview in abnఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బద్ధవ్యతిరేకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు షర్మిల ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ ఇస్తుంది. ఆంధ్రజ్యోతిలో బాగా ఫేమసైన ఓపెన్ హార్ట్ కార్యక్రమం కొత్త సీజన్ మొదటి గెస్ట్ షర్మిల. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ కు, ఆ పార్టీ అభిమానులకు పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి.

ఆంధ్రజ్యోతితో జగన్ వైరం ఈ నాటిది కాదు. వైఎస్ కూడా అప్పట్లో రాధాకృష్ణతో పెద్ద యుద్ధమే చేశారు. అయితే అన్నకు రాజకీయంగా ఎంతో చేసిన షర్మిల… తన రాజకీయ భవిష్యత్తు గురించి అన్న పట్టించుకోపోయే సరికి తన దారి తాను చూసుకున్నారు. తన పార్టీకి మీడియా సపోర్ట్ కావాలి కాబట్టి కుటుంబ వైరం పక్కనపెట్టి ఆర్కే తో కలిసి పని చేస్తున్నారు.

ADVERTISEMENT

తనను పట్టించుకోని అన్న కోసం అతని శత్రువులను తన సొంత శత్రువులుగా చేసుకునే అవసరం షర్మిలకు లేదు. అయితే షర్మిలకు ఏ రకంగానూ సహాయపడని జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రం ఇంకా షర్మిల తమ రాజకీయ అవసరాల కోసమే పని చెయ్యాలి అనుకోవడం గమనార్హం.

అయితే రాజకీయాలలో అవసరాలు, సహాయాలు ఎప్పుడూ రెండు వైపులా ఉండాలి. అందుకే షర్మిల తన దారి తాను చూసుకున్నారు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో కనీసం జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడి ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఉంటే చాలని జగన్ అండ్ కో కోరుకుంటున్నారు.

కాసేపు ఆ విషయాన్ని కూడా పక్కన పెడితే… ఇప్పుడు వరకు తన ప్రతీ రాజకీయ అడుగులోనూ తల్లిని కూడా తప్పకుండా తీసుకుని వెళ్లిన షర్మిల… ఆర్కే తో ఇంటర్వ్యూకు ఆమె ను తీసుకుని వెళ్లకుండా జగన్ కు మేలు చేశారనే చెప్పుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories