
టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ మాదిరి షర్మిల, జగన్ మధ్య రాజకీయ యుద్ధం నడుస్తుంది. ఆస్తి కోసం ఒకసారి, వారసత్వం కోసం మరోసారి ఇలా అన్న-చెల్లెళ్ళ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ వస్తుంది.
అయితే తాజాగా మరోసారి వీరిద్దరి మధ్య రాజకీయ వార్ షురూ అయ్యింది. తనకు ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా చంద్రబాబు ఇవ్వాలంటూ, అలా ఇవ్వకపోతే అసెంబ్లీకి రానంటూ మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ చేసిన వ్యాఖ్యల పై షర్మిల ఘాటుగా స్పందించారు.
ఒక పార్టీ అధినేతగా, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే గా అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యల మీద చర్చించాల్సిన వైస్ జగన్ చిల్లపిల్లాడిలా హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాను అంటూ మారం చెయ్యడం చూస్తుంటే అసెంబ్లీ కి వెళ్ళడానికి జగన్ భయపడుతున్నారేమో అనిపిస్తుంది.
ఇది ఆయన అజ్ఞానానికి, అవివేకానికి నిదర్శనమని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీకి వెళ్ళి గళం వినిపించడానికి భయంగా ఉంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవచ్చు అంటూ తన అన్న జగన్ కు ఉచిత సలహా ఇచ్చారు షర్మిల. 40 శాతం మంది ప్రజలు వైసీపీ పార్టీకి ఓటు వేసింది అసెంబ్లీ మీద అలగడానికో, హోదా ఇవ్వలేదని మారం చేయడానికో కాదు.
ప్రజా తీర్పుని గౌరవించకుండా కుంటి సాకులు చెప్పుకుంటూ మీడియాలో ప్రెస్ మీట్లు పెట్టడానికి కాదు మిమ్మల్ని, మీ పార్టీ నేతలన్నీ ఎమ్మెల్యే గా గెలిపించింది, కేవలం అధికారం ఉంటేనే చట్ట సభలకు హాజరవుతాను, ప్రతిపక్షములో ఉంటే పార్టీ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే చేస్తాను అంటే ఇది అప్రజాస్వామ్యం అంటూ షర్మిల గట్టిగానే జగన్ కు కౌంటర్ వేశారు.
అయితే తనకు లేని హోదా ను హక్కు గా పోయిందాలనుకుని, దానిని ప్రభుత్వమే ఇవ్వాలంటూ కోర్ట్ కెక్కిన జగన్, తన చెల్లి, తల్లి కి హక్కు గా ఇవ్వాల్సిన వైస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తులను మాత్రం ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టడానికి కోర్ట్ లో కేసులు వేసి మరి అడ్డుకుంటున్నారు. ఉన్న హక్కు అడిగితేనే ఇవ్వరు కానీ లేని హోదా కావాలా.? అంటూ జగన్ తీరు పై విమర్శలు ఎదురవుతున్నాయి.
దీనితో జగన్ చెప్పే మాటలు, పాటించే విలువలు ఏ పాటివో ఇట్టే అర్ధమవుతుంది అంటూ చెవులు కొరుక్కుంటున్నారు సామాన్యులు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో విపక్ష సభ్యుల నుంచి జగన్ హరించిన హక్కులు, అణిచివేసిన గొంతులు గుర్తుకొచ్చే ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి భయపడుతున్నారు పులివెందుల ఎమ్మెల్యే అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
After the wild-card contestants enter, the basic expectation is that the existing contestants take the…
Jailer 2 is scheduled to arrive in theatres this week. However, the makers have opted…