వైసీపీ పునాదులు కూల్చేది వీరేనా..?

YS-Sunitha-YS-Sharmila-Idupulapaya

కుటుంబాన్ని చీల్చి, రాష్ట్రాన్ని నాశనం చేసి ఒక నియంతలా పాలన కొనసాగిస్తున్నారు జగన్ అంటూ వైసీపీ ప్రభుత్వం పై, ముఖ్యమంత్రి జగన్ పై నిప్పులు చెరుగుతున్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైస్ షర్మిల.

ADVERTISEMENT

తన పై వైసీపీ నేతలు చేస్తున్న వ్యక్తిగత దాడులను సైతం పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం పై యుద్దానికి సిద్దమైన షర్మిలకు ఇప్పుడు ఆమె సోదరి వైస్ సునీతా రెడ్డి తోడుగా నిలబోతున్నారనే వార్త కొన్ని రోజుల నుంచి ప్రచారంలో ఉంది.

ఇప్పుడు ఈ ప్రచారాన్నిబలపరుస్తూ కడప పర్యటనలో ఉన్న షర్మిలతో దివంగత నేత వైస్ వివేకా కుమార్తె వైస్ సునీతా రెడ్డి భేటీ అయ్యారు. వారిద్దరూ ఇడుపులపాయలో సమావేశమయ్యి దాదాపు రెండు గంటల పాటు తాజా రాజకీయ పరిస్థితుల పై చర్చలు జరిపినట్టు సమాచారం.

సునీతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి కడప ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడి తన ప్రత్యర్థిని రాజకీయంగా కూడా దెబ్బ తీసి తన తండ్రి చావుకి న్యాయం చేయాలని ఆశిస్తున్నారు. తన తండ్రి చావుకి కారణమైన వారిని జగన్ కాపాడుతున్నాడంటూ ఇప్పటికే న్యాయపోరాటం చేస్తున్న సునీతా ఇప్పుడు రాజకీయ పోరాటానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే జగన్ అటు సొంత కుటుంబసభ్యుల నుంచే విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇది జగన్ ను రాజకీయంగా దెబ్బతీయడానికి చూస్తున్న ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ, జనసేనలకు ఆయుధాలను అందించినట్లే భావించాలి. అలాకాకుండా వైస్ షర్మిల పై మోతాదుకు మించి విమర్శలకు దిగితే షర్మిల కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేసే అవకాశం ఉండడంతో అటు ముందుకు వెళ్లలేక, ఇటు మోనంగా ఉండలేక ‘కుడితిలో పడ్డ ఎలక మాదిరి’ కొట్టుకుంటున్నారు వైకాపా నాయకులు. ఇప్పుడు దానికి తోడు సునీతా ఎంట్రీ కూడా జరిగితే జగన్ వై నాట్ 175 కాదు కదా సొంత జిల్లాలో కూడా పట్టుకోల్పోయే ప్రమాదం లేకపోలేదు.

ఏ పార్టీ పునాదులు కూల్చి తన రాజకీయ పార్టీకి పునాదులు వేసారో ఇప్పుడు అదే పార్టీ వైసీపీ పునాదులు కదపడానికి సిద్దమవ్వడం యాదృచ్ఛికమో లేక దేవుని విధి రాతో కానీ జగన్ కు వ్యతిరేక పవనాలు మొదలయ్యాయి అనడానికి ఇది ఒక సంకేతంగా భావించాల్సిందేనా.?

అలాగే జగన్ ముఖ్యమంత్రి పదవిని అందుకోవడానికి గత ఎన్నికలలో ప్రత్యక్షంగా షర్మిల, పరోక్షంగా సునీతా ఇద్దరు జగన్ విజయానికి తోడుగా నిలిస్తే ఈ ఎన్నికలలో ఆ ఇద్దరే జగన్ ఓటమికి ప్రయత్నాలు మొదలు పెట్టడం మాత్రం దేవుని స్క్రిప్టే అనిపిస్తుంది అంటున్నారు కాంగ్రెస్ నాయకులు.

ADVERTISEMENT
Latest Stories