
కానీ, వైకాపా టికెట్ పై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరడం, వారి వెనుకే ఎంపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వందల సంఖ్యలో టీడీపీలో చేరడంతో వైకాపా ఓట్లన్నీ తెలుగుదేశం ఖాతాలోకి వెళ్లిపోయాయి. అయినప్పటికీ ఓటర్ల మనసులో తమపై ఉన్న అభిమానం క్రాస్ ఓటింగ్ కు కారణమవుతుందని వైకాపా భావించింది. ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తున్నప్పటికీ, అది వైకాపా విజయానికి మాత్రం దారితీయలేదు.
ఏ అభ్యర్థి ఎవరికి ఓటు వేస్తారన్న విషయం తెలిసేలా బార్ కోడ్ లను ఏర్పాటు చేయడంతోనే పలువురు క్రాస్ ఓటింగ్ కు భయపడ్డారని వైకాపా భావిస్తోంది. ఇక ఓట్లున్నా సీట్లు గెలుచుకోలేకపోయామని, బెదిరింపు, అక్రమ కేసులతో ఓటర్లను భయపెట్టి తెలుగుదేశం గెలిచిందని వైసీపీ అధినేత జగన్ మరియు ఇతర నేతలు ఆరోపణలు గుప్పించడం మినహా మరేమీ చేయలేని పరిస్థితి నెలకొంది. మరో పక్కన ఈ విజయాలతో అధికార టిడిపిలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది.
మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…
The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…