అవును నేను సంబరాల రాంబాబునే కానీ మేకప్ వేసుకోను!

YSRCP_Ambati_Rambabu_Dance_Sankranthiఈ నెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన జనసేన సభలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మంత్రి అంబటి రాంబాబుని ఉద్దేశ్యించి, “మంత్రివర్గంలో ఆయనో జోకర్. ఆయనో సంబరాల రాంబాబు. జగన్‌ పాలనలో కష్టాలు అనుభవిస్తున్న ప్రజలని రంజింపజేయడానికే అంబటి రాంబాబుని క్యాబినెట్లో జోకర్‌గా నియమించుకొన్నారు,” అని ఎద్దేవా చేశారు.

పవన్‌ కళ్యాణ్‌ ఈ వ్యాఖ్యలు చేసిన మర్నాడే మంత్రి అంబటి రాంబాబు సత్తెన్నపల్లిలో సంక్రాంతి పండగని పురస్కరించుకొని రోడ్డుపై డ్యాన్స్ చేశారు. ఆ వీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రాష్ట్ర ప్రజలందరూ అంబటి రాంబాబుకి పవన్‌ కళ్యాణ్‌ సంబరాల రాంబాబని సరైన పేరే పెట్టారని నవ్వుకొన్నారు. పవన్‌ కళ్యాణ్‌ తనని సంబరాల రాంబాబని ఎద్దేవా చేయడంపై మంత్రి అంబటి రాంబాబు వెంటనే స్పందిస్తూ, “నువ్వు, నీ తమ్ముడూ అన్నట్లు నేను సంబరాల రాంబాబునే! కానీ ముఖానికి రంగు వేయను.. ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను,” అంటూ ట్వీట్ చేశారు.

ADVERTISEMENT

పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల చంద్రబాబు నాయుడుతో భేటీ అవడం తర్వాత రణస్థలంలో టిడిపితో పొత్తులు ఉంటాయని స్పష్టం చేయడంతో వైసీపీ నేతలు భగభగమండిపోతూ వారిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకోకుండా చేయడానికి వారు దత్తపుత్రుడని, ప్యాకేజీ స్టార్ అని ఎంతగా రెచ్చగొడుతున్నా పవన్‌ కళ్యాణ్‌ ఏమాత్రం ఆవేశపడకుండా ఈవిదంగా ధీటుగా తిప్పికొడుతుండటంతో వారికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. వైసీపీ భయాందోళనలు, అభద్రతాభావం వారి మాటల్లోనే బయటపెట్టుకొంటూ 175 సీట్లు గెలుచుకోవడం ఉత్తుత్తి మాటలే అని వారే చాటి చెప్పుకొంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories