శృతి లో జనసేనను కూడా కలిపేశారుగా

ysrcp-andhra-pradesh--ys-jagan-cases-cbiతన మీద ఉన్న కేసులలో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చుక్కెదురు అయిన విషయం తెలిసిందే. దీనితో అధికార పార్టీ ఇరుకున పడినట్టు అయ్యింది. ప్రతిపక్షాలు దీనిపై ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. దానిని డిఫెండ్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు అధికారపక్ష నేతలు. అయితే సీఎం జగన్‌ కోర్టుకు హాజరైతే తప్పేమిటని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.

కోర్టుకు వెళ్లినంత మాత్రాన రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. ‘‘కోర్టులు చట్టవ్యతిరేక జూదశాలలు కాదుకదా! ఎవరైనా వెళ్లొచ్చు. చంద్రబాబు, సోనియా గాంధీ, జనసేన ముఖ్యులు కలిసి అక్రమంగా సీఎం జగన్‌పై కేసులు పెట్టారు. సీబీఐ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని తెలిపారు. గతంలో చంద్రబాబు సోనియా గాంధీ కలిసి జగన్ మీద కేసులు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

ADVERTISEMENT

ఇప్పుడు శృతిలో జనసేనను కూడా కలిపేసినట్టున్నారు. మరోవైపు… సీఎం కోర్టుకు హాజరయ్యే విషయంలో ఖర్చుతో సమస్య లేదని.. ముఖ్యమంత్రిగా ఆయన కీలకమైన సమయం వృథా అవుతుందని పేర్ని నాని పేర్కొన్నారు. మరి అది సమస్య అని పిటీషన్ లో పేరుకున్నారు కదా? మరోవైపు వందల కోట్లు ఆస్తి కలిగిన ముఖ్యమంత్రి ఆ ఖర్చు తన జేబులో నుండి పెట్టుకుంటే సమాజానికి మంచి మీసేజ్ ఇచ్చినట్టు అవుతుంది కదా.

ముఖ్యమంత్రి హైదరాబాద్ వచ్చిన ప్రతీ సారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 65 లక్షలు ఖర్చు అవుతుంది అని జగన్ తరపు న్యాయవాది సీబీఐ కోర్టులో వాదించారు. విభజన తరువాత తీవ్ర ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న రాష్ట్రానికి ఇది మరింత ఇబ్బందికరంగా మారుతుందని వారి వాదన. అయితే కోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు.

ADVERTISEMENT
Latest Stories