వైసీపీ లో అన్నదమ్ముల బంధం ఇంత బలమైనదా.?

YSRCP leaders and their brothers linked to murder and fake liquor scandals

వైసీపీలో అన్న – చెల్లెళ్ళ బంధం కన్నా అన్న – తమ్ముళ్ల బంధం చాల బలంగా కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ అధినేత వైస్ జగన్, ఆయన సోదరి షర్మిల మధ్య పచ్చగడ్డి కూడా భగ్గున మండే పరిస్థితి ఉంటే జగన్ – అవినాష్ లా మధ్య ఉండే అన్న – తమ్ముళ్ల బంధం గొడ్డలి వేటును కూడా గడ్డిపరకగా మార్చేసింది.

ఇక వైసీపీ నేతలలో కొంతమంది నాయకులు తమతో పాటు తమ సోదరులను సైతం రాజకీయంలోకి తెచ్చారు, తెర ముందు పార్టీ నేతలుగా వీరి చలామణి అయితే తెరవెనుక జరిగే అంతర్గత కార్యక్రమాల విషయంలో వారు చక్రం తిప్పిన ఘటనలు నేడు వెలుగులోకొచ్చాయి.

ADVERTISEMENT

అందుకు పిన్నెల్లి సోదరులు, జోగి బ్రదర్స్ అవినీతి, అక్రమాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. టీడీపీ నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బైలు పిటిషన్ ను ధర్మాశనం కొట్టేసింది.

అలాగే గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిలు కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు సుప్రీం న్యాయమూరులైన జస్టిస్ విక్రమ్ నాధ్, జస్టిస్ సందీప్ మెహతా. దీనితో తమకు లొంగిపోయేందుకు కాస్త సమయం కావాలంటూ న్యాయస్థానాన్ని అభ్యర్ధించారు పిన్నెల్లి సోదరులు.

అయితే వీరిద్దరి మధ్య ఉన్న బలమైన బంధమే వీరిని ఇటువంటి అరాచకంలో భాగం చేసిందనే చెప్పాలి. ఇద్దరి ప్రాణాలు తీసే పాపంలో ఈ అన్న తమ్ముల బంధం బలంగా పనిచేసిందనేది సుస్పష్టమయ్యింది. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఏ – 6 కాగా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఏ – 7 గా ఉన్నారు.

ఇక ఇదే మాదిరి జోగి బ్రదర్స్ సైతం నకిలీ మద్యం కుంభకోణం అంశంలో అరెస్టయ్యి విచారణ ఎదుర్కుంటున్నారు. నకిలీ మద్యం కేసులో అరెస్టయిన ఈ ఇద్దరు సోదరులు జోగి రమేష్, జోగి రాము ని ఎక్సైజ్ అధికారులు మూడో రోజు కస్టడీకి తీసుకున్నారు.

అయితే ప్రస్తుతానికి వీరిద్దరూ కూడా ఈ కేసు విషయమై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అలాగే ఇదే కేసులో మరో సోదరులు జనార్దన్ రావు, జగన్మోహన్ రావు అనే వారు కూడా ప్రధాన నిందితులుగా విచారణ ఎదుర్కొటున్నారు

అయితే వైసీపీ అవినీతిలో అరాచకంలో ఒక్కటిగా ఉంటున్న ఈ సోదరుల బంధం చాల బలమైనదనే చెప్పాలి. వీరి బలం రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా అదే తీరును కొనసాగించేలా చేసింది, దాని ఫలితమే ఇప్పుడు ఇలా జంటగా ప్రతిఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది.

ADVERTISEMENT
Latest Stories