అక్కడ అవినాష్…ఇక్కడ హరీష్..!

YSRCP and BRS family politics controversies in Andhra and Telangana

వైసీపీ, బిఆర్ఎస్ రెండు పార్టీలలోనూ సొంత కుటుంబ సభ్యుల నుంచి సొంత పార్టీ సభ్యుల పైనే అది కూడా వారి కుటుంబ బంధువుల మీద హత్యారోపణలు, అవినీతి మరకలు ఎదురయ్యాయి.

అక్కడ ఏపీ వైసీపీ లో వైఎస్ కుటుంబ సభ్యుడైనా, వైసీపీ ఎంపీ గా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి పై షర్మిల వివేకా హత్యారోపణలు చేసింది. ఇక ఇక్కడ తెలంగాణ బిఆర్ఎస్ లో కేసీఆర్ మేనల్లుడు, బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కు కవిత కాళేశ్వరం అవినీతి మరకలు పూసింది.

ADVERTISEMENT

అయితే అక్కడ వైసీపీ లో ఆ పార్టీ అధినేత వైస్ షర్మిల సోదరుడు వైస్ జగన్ తన చెల్లిని కాదని తన బంధువైన వైస్ అవినాష్ రెడ్డి వైపే నిలబడ్డారు, ఆయనకే తన మద్దతు ప్రకటించారు. ఇక ఇక్కడ కేసీఆర్ కూడా తన సొంత కుమార్తెను దాటి మరి తన మేనల్లుడు హరీష్ రావు కు అండగా నిలిచారు, ఆయన వైపే పార్టీని నిలబెట్టారు.

అక్కడ వైస్ జగన్ అవినాష్ రెడ్డి కోసం సొంత చెల్లి, తల్లిని కూడా దూరం చేసుకుని వారికీ వ్యతిరేకంగా తన సొంత మీడియాలోనే షర్మిల వ్యక్తిగత జీవితం మొదలు రాజకీయ ప్రయాణం వరకు ప్రతి అంశం మీద సాక్షి బాణాలు కురిపించారు, వైసీపీ ఉన్మాదం చూపించారు.

ఇక ఇక్కడ కేసీఆర్ కవిత విషయంలో ఇప్పటి వరకు మౌనంగా ఉన్నప్పటికీ తాజాగా తీసుకున్న పార్టీ సస్పెన్షన్ నిర్ణయంతో కవిత పై విమర్శలకు బిఆర్ఎస్ శ్రేణులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అయ్యింది.

అలాగే కవిత పై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల కూడా అటు బిఆర్ఎస్ ఇటు కేసీఆర్ కుటుంబం మౌనాన్నే ఆశ్రయయించడంతో కవిత ను పరోక్షంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కుటుంబం నుంచి బహిష్కరించినట్లు చేసింది.

అయితే అక్కడ వైసీపీ ఇక్కడ బిఆర్ఎస్ రెండు పార్టీల ఇంటి పోరులోను సొంత రక్త సంబంధాని కంటే కూడా రాజకీయ బంధానికే విలువ ఎక్కువ అనేలా, విధేయతకు పట్టం కట్టేలా అక్కడ షర్మిల పై జగన్ అవినాష్ రెడ్డి నే గెలిపించారు, వైసీపీ లో కీలక నేతగా ఎదగనిచ్చారు.

అదే విధంగా ఇక్కడ కవిత మీద హరీష్ రావు పై చేయి సాధించారు, పార్టీ లో తన పట్టు నిలుపుకున్నారు. చివరికి వైసీపీ నుంచి బయటకు నెట్టబడిన షర్మిల టి . వైఎస్ఆర్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరి తెలంగాణ నుంచి ఏపీకి వచ్చారు.

మరి ఇప్పుడు బిఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన కవిత జాగృతిగా ముందుకొస్తారా.? లేక సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్టుగా బీసీ కాన్సెప్ట్ ఆధారంగా గతంలో కేసీఆర్ స్థాపించిన ‘తెరాస’ పార్టీ పేరు వచ్చేలా ‘తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి’ అంటూ మరో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తారా.?

ADVERTISEMENT
Latest Stories