
రాజకీయాలతో సంబంధం లేని వారిని సైతం రాజకీయ వేదికల మీదకు తీసుకువచ్చి ప్రతిపక్ష నేతల కుటుంబాలను నీచంగా విమర్శిస్తూ పైశాచిక ఆనందం పొందే వైసీపీ పార్టీ నాయకులకు ఇప్పుడే అదే సొంత కుటుంబాల నుండి ఎదురుదాడి మొదలయ్యింది.
ముందుగా ఆ పార్టీ అధినేత వైస్ జగన్ విషయానికి వస్తే.., ఆయన రాజకీయ జీవితంలో ఎన్నడూ తన ప్రత్యర్థుల పై రాజకీయ విమర్శలు చేసిందే లేదు. ఎప్పుడు చూసిన రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దాడి, ఆ కుటుంబంలోని మహిళలను కించపరచడం, అలాగే తన ప్రవైట్ సైన్యం తో ఆయా కుటుంబాల మహిళల పై సోషల్ మీడియా వేదికగా నీచమైన విమర్శలకు పాల్పడడం తన ఎన్నికల వ్యూహంలో ఒక భాగంగా కొనసాగిస్తూ వస్తున్నారు.
చంద్రబాబు సతీమణి, పవన్ మాజీ భార్యలు, ప్రస్తుత అర్దాంగి జగన్ బాధితులలో ముఖ్యమైన వారు. అలాగే నారా, నందమూరి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలను బూతద్దంలో చూపిస్తూ కుటుంబాలను చీల్చే రాజకీయాలు చేయడానికి ఎటువంటి సాక్ష్యాలు లేకుండా సాక్షిలో కథనాలు రాసి వికృత ఆనందం పొందిన జగన్ కు ఇప్పుడు తన సొంత కుటుంబం నుండే రాజకీయ ప్రత్యర్థులు తయారయ్యారు.
2019 జగన్ గెలుపు కోసం కాళ్ళకు చక్రాలు కట్టుకుని తిరిగిన వైస్ షర్మిల ఇప్పుడు అదే జగన్ ఓటమి కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అలాగే ఆయన మరో సోదరి వైస్ వివేకా కుమార్తె సునీత కూడా జగన్ ఓటమి కోసం గొంతరిగేలా గర్జిస్తున్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించవద్దు, అటువంటి వారికీ అండగా ఉండొద్దు, తన అన్నకు ఓటేయవద్దు అంటూ గొంతెత్తి అర్దిస్తున్నారు షర్మిల, సునీత.
తనను గెలిపించిన ప్రజలకు గంటా, అరగంట సమయం కేటాయిస్తూ మిగిలిన సమయమంతా చంద్రబాబు, పవన్ ను దూషించడం మీదే పెట్టిన అంబటి రాంబాబు వచ్చిన మంత్రి పదవి అవకాశాన్ని సంబరాలు చేసుకుంటాకి, సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టుకోవడానికి అన్నట్లుగా వృధా చేస్తూ, పోలవరం గురించి అడిగితే సినిమా రివ్యూలు చెపుతూ పవన్ వ్యక్తిగత జీవితం పైన అడ్డుఅదుపు లేని విమర్శలు చేసిన అంబటి ఇప్పుడు కూతురు వ్యక్తిగత జీవితం పై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు.
సోషల్ మీడియాలో తన చిన్న కూతురు భర్త గౌతమ్ అంబటికి వ్యతిరేకంగా ఒక వీడియో పోస్ట్ చేసారు. నా పేరు గౌతమ్, నేను అంబటి రాంబాబు అల్లుడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నా అంటూ మొదలుపెట్టిన గౌతమ్ రాంబాబు వంటి నీచుడికి, దుర్మార్గుడికి ఎవరు ఓటు వేయొద్దు అంటూ ఏపీ ఓటర్లను హెచ్చరించారు. ఇక దీనిపై వివరణకు మీడియా ముందుకు వచ్చిన అంబటి యధావిధిగా ఇదంతా బాబు, పవన్ ల కుట్రగా అభివర్ణించారు.
తన చిన్న కుమార్తె కు తన అల్లుడు గౌతమ్ కు మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఇలా కుటుంబంలో ఉన్న సమస్యలను సాకుగా చేసుకుని పవన్ తన పై ఇటువంటి తప్పుడు విమర్శలకు పాలపడుతున్నదంటూ ఇంటి గుట్టు బయటపెట్టారు. తన ఇంట్లోనే మనస్పర్థలతో విడాకులు తీసుకుంటున్న వ్యక్తిని ఉంచుకుని పవన్ పెళ్లిళ్ల గురించి విమర్శలు ఏంటి అంటూ పవన్ అభిమానులు అంబటిని టార్గెట్ చేస్తున్నారు.
ఇక చివరిగా కాపు సమాజాన్ని ఉద్దరించడానికి ఈ నా అవతారం అంటూ చెప్పుకున్న ముద్రగడ పద్మనాభం విషయానికి వస్తే ఆయన ఎదుగుదలకు కాపు కులాన్ని అడ్డుపెట్టుకుంటారే కానీ అదే సామజిక వర్గం నుండి ఎవరైనా పార్టీ పెట్టి ఎదగాలి అంటే ముందుగా ఆ నాయకులను, ఆ పార్టీని పాతాళానికి తొక్కాలి అని చూసే వారిలో మొట్టమొదటి వ్యక్తి ముద్రగడ అవుతారనేది ప్రజారాజ్యం, జనసేన తో నిరూపించబడింది.
అదే సామజిక వర్గం నుండి రాజకీయాలలోకి వచ్చిన ఒకే కుటుంబం సభ్యులైన చిరంజీవి, పవన్ విషయంలో ముద్రగడ ప్రవర్తించిన తీరు చూసి ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులే ఆయనకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. పిఠాపురంలో పవన్ ను ఓడించి ఇంటికి పంపకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభ ‘రెడ్డి’ గా మార్చుకుంటా అంటూ సవాల్ విసిరిన ఈ పెద్దాయనకు తన ఇంటి ఆడబిడ్డ నుండే ప్రతిసవాల్ ఎదురయ్యింది.
నా పేరు క్రాంతి భారతి, నేను ముద్రగడ గారి కుమార్తెను, నా తండ్రి చేసిన సవాల్ ను నేను వ్యతిరేకిస్తున్నాను. కేవలం పవన్ ను తిట్టించడానికే వైసీపీ ముద్రగడను పార్టీలో చేర్చుకున్నారు. ఒక్కసారి ఎన్నికల తంతు పూర్తవుతే ముద్రగడను పక్కన పెట్టడం ఖాయం. నేను నా తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పవన్ కు జనసేనకు నా మద్దతు తెలుపుతున్నాను అంటూ తన నిర్ణయాన్ని ప్రకటించారు.
అలాగే ప్రకటించిన నిర్ణయానికి కట్టుబడి తన భర్తతో కలిసి తుని వారాహి యాత్రలో పాల్గొని పవన్ కు తన మద్దతు తెలియచేసారు ముద్రగడ కుమార్తె క్రాంతి భారతి.అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బుడి ముత్యాల నాయుడు కి వ్యతిరేకంగా ఆయన సొంత కుమారుడు రవి గళం వినిపిస్తూ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ తో కలిసి నడుస్తున్నారు. అలాగే టెక్కలి నియోజకవర్గం నుండి పోటీలో నిలబడిన దువ్వాడ కు వ్యతిరేకంగా ఆయన భార్య వాణి పోటీలో దిగడానికి సిద్దపడి చివరి నిముషంలో వెనుతిరిగారు.
అన్న గెలుపును అడ్డుకోవడానికి చెల్లి, తండ్రి ప్రత్యర్థి గెలుపు కోసం కూతురు, మామ ఓటమి కోసం అల్లుడు, తండ్రి పరాజయం కోసం కొడుకు, భర్తకు వ్యతిరేకంగా భార్య నిలవడం వైసీపీ కుటుంబం రాజకీయాలలో కోసం మెరుపే. ఇలా ఎదుటి వాటి కుటుంబాలలోకి చొచ్చుకొచ్చి వారి వ్యక్తిగత విషయాలను రాజకీయ వేదికల మీద చర్చకుంచె వైసీపీ నేతలకు వారి కుటుంబ సభ్యుల నుంచే ఇటువంటి రిటర్న్ గిఫ్ట్ రావడం నిజంగా దేవుడి స్క్రిప్టే అనుకోవాలి.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…