మేడలో వైసీపీ కండువా, వెనక జగన్ – అవ్వాలి ఎన్టీఆర్ సీఎం!

తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టే క్రమంలో చాలా రొటీన్ గా వైసీపీ ఉపయోగించే పేరు జూనియర్ ఎన్టీఆర్. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు… దాదాపుగా ప్రతి వైసీపీ నేతకు జూనియర్ ఎన్టీఆర్ మీద ఎక్కడలేని ప్రేమ, అభిమానాన్ని ప్రదర్శించడం చాలా పరిపాటిగా మారిపోయింది. తాజాగా ఈ జాబితాలో ఒక ప్రముఖ నిర్మాత కూడా చేరారు.

ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో “నరసింహుడు” అనే సినిమా నిర్మించిన చెంగల వెంకట్రావు గుర్తున్నారా? అదేలేండి… ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడిన నిర్మాతే. ప్రస్తుతం ఈయన గారికి ఉన్నట్లుండి జూనియర్ ఎన్టీఆర్ మీద విపరీతమైన అభిమానం పొంగి పొర్లుతోంది.

ADVERTISEMENT

తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ కు అప్పచెప్పి, జూనియర్ ఎన్టీఆర్ ను సీఎంగా ప్రకటించాలట. అప్పుడే తెలుగుదేశం పార్టీ బతికి బట్ట కడుతుందట. ఇదంతా టీడీపీపై ఉన్న అభిమానమో లేక జూనియర్ ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమో అనుకుంటే, మీరు బురదలో కాలేసినట్లే. ఈయన గారి జెండా, ఎజెండా ఏమిటో ఆ వీడియోలో స్పష్టంగా కనపడుతోంది.

వెనుక సీఎం వైఎస్ జగన్ ఫోటోను పెట్టుకుని, మెడలో వైసీపీ జెండా వేసుకుని జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీకి సీఎం చేయాలని చంద్రబాబు, లోకేష్ మరియు బాలకృష్ణలపై విమర్శలు చేసారు. అసలు ఎలాంటి సంబంధం లేకుండా ఇలా ఎలా మాట్లాడతారు? అని ఎవరైనా అనుకుంటే పొరపాటే.

కుటుంబాల నడుమ చిచ్చు పెట్టడం, తద్వారా రాజకీయ లబ్ధిని చేకూర్చడం వైసీపీ యొక్క అజెండాలలో ప్రముఖమైనది. గత సార్వత్రిక ఎన్నికల ముందు కూడా ఇదే సూత్రాన్ని వైసీపీ పాటించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికి తెలిసినవే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… సాక్షాత్తు జగన్ కుటుంబంలోనే ఎన్నో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.

తల్లిని – చెల్లిని జగన్ తరిమేసారని కోడై కూస్తుంటే, తన కుటుంబంలోని విషయాలను పక్కన పెట్టి, ప్రత్యర్థి కుటుంబాలలో చిచ్చు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి నీచ రాజకీయాలను ఇకనైనా విడనాడితే మంచిది. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ మీద నిజంగానే అంత ప్రేమ ఉంటే, వైసీపీలోకి ఆహ్వానించి సీఎం సీటును ఇవ్వవచ్చు కదా?

ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఓ విషయం ప్రస్తావించాలి. ఇలా వైసీపీ అండ్ కో చేసే ప్రతి కామెంట్స్ కు మీడియా ముందుకు వచ్చి బదులు ఇవ్వలేనని, తన కట్టే కాలే వరకు టీడీపీతోనే అనుబంధం ఉంటుందని పలు మార్లు మీడియా ముఖంగా తెలిపారు. బహుశా ఇదే వైసీపీ అండ్ కోకు ప్లస్ పాయింట్ గా మారినట్లుంది.

ప్రతిసారి ఏదొక నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ – టీడీపీని ఉద్దేశించి కామెంట్స్ చేయడం, ప్రతిసారి దానికి వివరణ ఇవ్వడం అనేది ఎంతటి వారికైనా కుదరదు. ఇందుకు జూనియర్ ఎన్టీఆర్ కూడా మినహాయింపు కాదు. అలా అని మౌనం వహించడం కూడా ఇలాంటి వారికి ఊతమిచ్చినట్లే అవుతుంది.

ఖండించాల్సిన విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఖండిస్తే, ఇలాంటి వారికి అవకాశం ఇచ్చినట్లు అవ్వదు కదా అనేది టీడీపీలోని ఓ వర్గం మాట కూడా! ముళ్లును ముళ్ళుతోనే తీయాలి కదా… అలాగే ఈ సారి అవకాశం వచ్చినపుడు జూనియర్ ఎన్టీఆర్ వివరణ కూడా ఆ స్థాయిలో ఉంటే, వైసీపీ వర్గాలకు చెక్ పెట్టినట్లు అవుతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Hanuman Ansh Telugu Flops: What Went So Horribly Wrong?

Hanuman Ansh created a sensation at the Hindi box office, but its Telugu-dubbed version has…

33 minutes ago

విజయ్‌ మొహం ఎప్పుడూ ఇంతేనా? కాస్త నటించొచ్చుగా?

ప్రధాని మోడీ అదివారం చెన్నైలో పర్యటించారు. తమిళనాడులో రూ.13,000 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తర్వాత చెన్నై…

42 minutes ago