
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనను కూడా రాజకీయ వివాదాలకు వాడుకుంటున్న బ్లూ మీడియా పై తన ఆవేదనను వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదానికి కారణమంటూ ఆరోపణలు ఎదుర్కున్న యూ ట్యూబర్ లోకల్ బాయ్ నాని. ఎటువంటి ఆధారాలు లేకుండా తనను తన కుటుంబాన్ని కొన్ని ఛానెల్స్ వారు టార్గెట్ చేస్తూ రోడ్డు మీదకు లాక్కొస్తున్నారని.,నిజానిజాలు తెలుసుకుని వార్తలు ప్రచారం చేయాలే కానీ ఇలా సంచలనాల కోసం తంబ్ లైన్స్ పెట్టొద్దంటూ సదరు మీడియా వారికీ విజ్ఞప్తి చేశారు లోకల్ బాయ్ నాని.
విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదానికి యూ ట్యూబర్ నానినే కారణమంటూ కొన్ని నీలి మీడియాలు ప్రచారం చేశాయి.అంతటితో ఆగక సదరు నాని జనసేన పార్టీకి సంబందించిన వ్యక్తి అంటూ ఒక ముద్రేసేసి ప్రజల మీద రుద్దే ప్రయత్నాలు కూడా చేశారు సదరు మీడియా సంస్థలు. అయితే విచారణకు తీసుకెళ్లిన పోలీసులు ఆ సమయంలో నాని అక్కడ లేడు అనే ఆధారాలు న్యాయవాదులు చూపించడం ద్వారా నాని బయటకు వచ్చారు.
బయటకు వచ్చిన నాని తన పై జరుగుతున్న రాజకీయ కుట్రను, బ్లూ మీడియా ప్రచారాన్ని ఆ ఛానెల్స్ వారి ముందే తిప్పికొట్టారు. తనకు ఒక కుటుంబం ఉందని ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మీడియాలో వార్తలు ప్రచారం చేస్తే తమ కుటుంబ సభ్యులకు ఏదైనా జరగ రానిది జరిగితే దానికి బాధ్యత సదరు మీడియా వారు తీసుకుంటారా? అంటూ ప్రశ్నించారు. అసలు నాకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు అంటూ నిక్కచ్చిగా తేల్చి చెప్పారు లోకల్ బాయ్ నాని.
ప్రమాదానికి కారణాలు తెలుసుకుని., ఇటువంటి సంఘటనలు పునరుద్దరించకుండా ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల పై బాధిత కుటుంబాలతో చర్చించి ప్రభుత్వ పెద్దలకు సూచించాల్సిన బాధ్యత కలిగిన మీడియా వారు ప్రమాదానికి ఏదోఒక పార్టీ వ్యక్తి కారణమంటూ, విషయాన్ని పక్కదోవ పట్టించి ప్రతిదాన్ని రాజకీయ కోణంలోనే విశ్లేషణ చేసుకుంటూ పొతే ఇక ‘నీలి మీడియా’, ‘నల్ల మీడియాగా’ మారిపోతుంది అనే విషయాన్నీ గ్రహించాలి.
ఇక లోకల్ బాయ్ పై ప్రచారం ఇలా ఉంటే…మరో యూ ట్యూబర్ నా అన్వేషణ ఛానెల్ అన్వేష్ పై మరో ఆరోపణతో ప్రచారం మొదలుపెట్టింది ఈ బ్లూ మీడియా. ప్రపంచ యాత్రికుడిగా పలు దేశాలు పర్యటించి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న అన్వేష్ తాజాగా తన పర్యటనలో భాగంగా జింబాబే దేశంలో ఉన్న అన్వేష్ ఏపీ రాజకీయ పార్టీల పై ప్రజల పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం విధానాలను పరోక్షంగా తప్పుబట్టినా తట్టుకోలేని బ్లూ మీడియా ఇక మిషన్ అన్వేష్ మొదలుపెట్టింది.
ఒకప్పుడు ఎంతో ధనిక దేశంగా ఉన్న జింబాబే ఇప్పుడు ఇలా పేద దేశంగా మారడానికి గల కారణాలను వివరిస్తూ అందుకు ఉదాహరణగా ఏపీ ఆర్థిక పరిస్థితిని ఉద్దేశించి మాట్లాడారు. దేశాన్ని అభివృద్ధి చేస్తాను అనే హామీ ఇచ్చిన నాయకుడిని వదిలి మీ అందరికి అన్ని ఉచితంగా అందిస్తాం అని హామీ ఇచ్చే నాయకుడి ఎన్నికలలో గెలిప్పించుకుని దేశానికీ అధిపతిని చేశారు ఇక్కడి ప్రజలు.
ఆ ఉచితాల తాలూకా ప్రతిఫలమే ఇప్పుడు ఈ దేశం ఎదుర్కుంటున్న ఆర్థిక దుస్థితికి కారణం అంటూ ఏపీ ప్రజలు కూడా ఇలా ఉచిత పథకాల వైపు ఆశ చూపడం వల్లనే నేడు ఏపీకి ఈ దుస్థితి వచ్చిందని కనీసం ఇప్పటికైనా అభివృద్ధి వైపు అడుగులు వేసే ప్రయత్నాలు మొదలుపెట్టాలని లేకపోతె ఏపీ కూడా మరో జింబాబే, మరో శ్రీలంక మాదిరి తయారవుతుందని ప్రజలను చైతన్యపరిచారు.అయితే ఇందులో నా అన్వేషణ అన్వేష్ ఏ ఒక్క రాజకీయ పార్టీని విమర్శించలేదు అలాగే ఏఒక్క రాజకీయ పార్టీకి తన మద్దతు తెలపలేదు. కేవలం ప్రజలు ఓటు వేసే ముందు ఈ రోజు మాకేమొస్తుంది అని కాకుండా రేపటి తరం భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలంటూ చెప్పారు.
అయితే ఇక తమ కనుసన్నల్లో నడిచే బ్లూ మీడియా వారికీ జగన్ ప్రభుత్వం నుండి ఆదేశాలు వెళ్ళాయో లేక వారే తమకలవాటైన సొంత కథనాలను ప్రజల పై రుద్దాలనుకున్నారో కానీ లోకేష్ సదరు యూ ట్యూబ్ ఛానెల్ వారికి 7 కోట్ల పెద్ద మొత్తంలో డబ్బిచ్చి ఇటువంటి వార్తలు ప్రచారం చేపిస్తున్నారంటూ వార్తలు రాయడం మొదలుపెట్టారు. పవన్ పైనా అదే ప్రచారం., యూ ట్యూబర్ కైనా అదే ప్రచారమా.. స్క్రిప్ట్ మార్చండి సామి! వినలేక చస్తున్నాం అంటున్నారు వైసీపీ వ్యతిరేక వర్గం వారు.
Kamiya Jani has been a popular face on social media for her way of interacting…
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…