వైసీపీ సిద్ధాంతం: అన్నం వద్దు..మందే ముద్దు..!

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి రాజకీయాలు చేయడం రావు కానీ శవ రాజకీయాలలో మాత్రం మాస్టర్ డిగ్రీ సాధించుకున్నారు అనేది ఎన్నో సార్లు నిరూపించుకున్నారు. అయితే మాది పేదల ప్రభుత్వం కూటమి నేతలది పెత్తందారీ వ్యవస్థ అంటూ ఎన్నికల ముందు ఊకదంపుడు ప్రసంగాలు చేసిన జగన్ పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ల మీద మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు విషం కక్కుతూనే ఉన్నారు.

2018 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్లను 2019 వైసీపీ ప్రభుత్వం వచ్చి రాగానే టీడీపీ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేస్తూ అన్న క్యాంటిన్లకు తాళం వేసింది. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు 5 రూ. లకే ప్లేట్ నిండా భోజనంతో సామాన్యుడి కడుపు నింపే అన్న క్యాంటిన్లను మూసి పేదవాడి కడుపు కొట్టే మద్యం దుకాణాలు తెరిచింది.

ADVERTISEMENT

రాష్ట్రమంతా మద్యపానాన్ని అమలు చేస్తాం అంటూ ఆడపడుచులకు హామీ ఇచ్చి గద్దెనెక్కిన వైసీపీ ప్రభుత్వం ఏకకంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను సిద్ధం చేసేలా జీవో తీసుకువచ్చి లిక్కర్ వ్యాపారం చేసింది. మధ్య నియంత్రణ అంటూ 100 రూ. మద్యాన్ని 500 చేసి మందుబాబుల జేబులు కాళీ చేసి వారి ఆరోగ్యాలతో వ్యాపారం చేసింది.

అయితే కనీసం ఆ వ్యాపారంలో అయినా నాణ్యమైన మద్యాన్ని అందించారా అంటే అది లేదు. కేవలం గత ఐదేళ్లలోనో ఏపీ ప్రభుత్వ మద్యం దుకాణాలలో మద్యం సేవించి చనిపోయిన వారి సంఖ్య దాదాపు రెట్టింపయ్యింది అని గణాంకాలు చెపుతున్నాయి. కల్తీ మద్యం, చీప్ లిక్కర్, దేశంలో మరెక్కడా దొరకని బ్రాండ్లతో వైసీపీ ప్రభుత్వం మందుబాబుల బలహీతతో వ్యాపారం చేసింది.

పేదల కడుపు నింపే పథకానికి తూట్లు పొడిచి, పేదల కడుపు కొట్టే వ్యవస్థను సృష్టించి మాది పేదల ప్రభుత్వం అంటూ ప్రచారం చేసుకున్న వైసీపీ కి 2024 ఎన్నికలలో ప్రజలు తమ ఓటు తో మంచి కిక్ ఇచ్చారనే చెప్పాలి. కనీసం ఇప్పటికైనా ప్రజలు ప్రభుత్వం నుండి ఏమి ఆశిస్తారో, ప్రభుత్వం నుండి ప్రజలకు ఏది అందుబాటులో ఉంచాలో, ప్రభుత్వాలు వేటితో వ్యాపారం చెయ్యాలో, ప్రభుత్వం ఏ వ్యాపారాలకు దూరంగా ఉండాలో వైసీపీ తెలుసుకోలేకపోతుంది.

పొద్దున్న లేచింది మొదలు రాత్రికి పడుకునే లోపు ఎవరొకరు అన్న క్యాంటీన్ల మీద తప్పుడు వార్తలు ప్రచారం చెయ్యడం, వారి సోషల్ మీడియాలలో ఫేక్ వీడియో లు పోస్ట్ చెయ్యడం పరిపాటిగా మారిపోయింది వైసీపీ నేతలకు. అయితే వైసీపీ చేస్తున్న ఈ విష ప్రచారాలను వైసీపీ చేతిలో అధికారం ఉన్నప్పుడే ప్రజలు నమ్మలేదు. మరి ఇప్పుడు ప్రజలు నమ్ముతారని వైసీపీ ప్రయాసపడడం వారి అత్యాశకు నిదర్శనమనే చెప్పాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rohit Back as MI Cap? Truth Behind Big Rumours

Mumbai Indians have reportedly shut down rumours of Rohit Sharma returning as captain for IPL…

26 minutes ago

ఈ 10 డీఎస్సీ కాదు.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లే!

జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఎదురుచూస్తున్న రాష్ట్రంలో యువతకు వాటి గురించి పూర్తి స్పష్టత ఉంది. కానీ ఐదేళ్ళు సిఎంగా రాష్ట్రాన్ని…

28 minutes ago