వైసీపీ లో రెడ్డి సామాజికవర్గం మొత్తం సైలెంట్..వై.?

వైసీపీ ఓటమి తరువాత ఆ పార్టీలో గతంలో చక్రం తిప్పిన రెడ్డి సామాజికవర్గ నేతలంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు వై.? అనే ప్రశ్న ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులలో కూడా బలంగా వినిపిస్తుంది.

గత వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా ఏకచక్రాధిపత్యం వహించిన సజ్జల నుంచి వైవి సుబ్బారెడ్డి, కాకినాడ ఫోర్ట్ కేంద్రంగా లక్షల కోట్ల రేషన్ బియ్యం మాఫియా అంటూ ఆరోపణలు ఎదుర్కొన్న ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి, రాజధాని అమరావతి వినాశనంలో కీలక పాత్ర పోషించిన ఆళ్ల రామకృష్ణ రెడ్డి,

ADVERTISEMENT

ఇక పుంగనూరు పీడింగులు గా పేరు గావించిన పెద్ది రామచంద్ర రెడ్డి, తాడిపత్రి కింగ్ అంటూ ప్రచారం చేసుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి, అలాగే గుడ్ మార్నింగ్ స్టార్ గా వెలుగొందిన కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి, లిక్కర్ మాఫియా కేసులో అరెస్టయిన మిథున్ రెడ్డి, చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి,

వివేకా దారుణ హత్య కేసులో సొంత కుటుంబ సభ్యుల నుంచే ఆరోపణలు మోస్తున్న అవినాష్ రెడ్డి…ఇలా వైసీపీ ప్రభుత్వంలో తమ హవా సాగించిన ఈ సోకాల్డ్ రెడ్డి నాయకులందరూ ఇప్పుడు సైలెంట్ లోకి వెళ్లిపోయారు. ఇక వైసీపీ లో జగన్ తరువాత స్థానంలో ఉన్న విజయ్ సాయి రెడ్డి ఏకంగా వైసీపీ కి రాజీనామా చేసి జగన్ కు దూరంగా వెళ్లిపోయారు.

జగన్ చేపడుతున్న పార్టీ కార్యక్రమాల విషయంలోనూ, ప్రభుత్వం కు వ్యతిరేకంగా చేపడుతున్న నిరశనల విషయంలోనూ ఈ రెడ్డి నేతలెవ్వరూ మీడియా ముందు కనిపించడం లేదు, పార్టీ క్యాడర్ తో కలిసి ముందుకెళ్లడం లేదు. రాష్ట్ర రాజధాని అమరావతి అంశం నుంచి జగన్ ప్రతిపాదించిన మావిగన్ వివాదం వరకు వైసీపీ కాపు నేతలే జగన్ నినాదాలను ప్రజల ముందుకు తీసుకెళుతున్నారు, వారితో విమర్శలు ఎదుర్కుంటున్నారు.

పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్, బొత్స సత్యనారాయణ వంటి వైసీపీ కాపు నేతలే ఇప్పుడు వైసీపీ ని కాపు కాస్తున్నారు. ఇక జోగి రమేష్, విడుదల రజని వంటి నాయకులు అరకొరగా మీడియాలో కనిపిస్తూ పార్టీ అధినేత జగన్ దృష్టిలో పడుతున్నారు.

పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ కోటరీ లో భాగమైన రెడ్డి నాయకులు, జగన్ కు అత్యంత సన్నిహితులుగా మెలిగిన రెడ్డి నేతలు ఇప్పుడు పార్టీ ఓటమి లో మాత్రం సైలెంట్ అయిపోయారు. నాడు జగన్ ప్రభుత్వంలో వైసీపీ లో కీలక పాత్ర పోషించిన ఈ రెడ్డి సామాజికవర్గ నేతల స్థానంలో ఇప్పుడు వైసీపీ కాపు నేతలు వచ్చి చేరారు.

పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో, ప్రత్యర్థి పార్టీల నేతల మీద విమర్శలు చెయ్యడంలో, ప్రభుత్వ నిర్ణయాలను వేలెత్తి చూపించడంలో వైసీపీ కాపు నేతలు ప్రధమ పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ సోకాల్డ్ కాపు నేతలందరూ రేపటి రోజున జగన్ 2.0 అధికారంలోకి వస్తే తిరిగి రెడ్డి నేతల ఆదేశాలు పాటించే సెంకండ్ గ్రేడ్ నాయకులుగా మిగులిపోతారా.? లేదా ఆ సామాజికవర్గ నేతలకే ఆదేశాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతారా.? జగన్ ఎదగనిస్తారా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

తెలంగాణలో మైండ్ గేమ్ పాలటిక్స్.?

తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…

12 minutes ago

జగన్‌ వార్నింగ్ ఇస్తే చంద్రబాబు దిగొచ్చారటగా?

అవును! నిజమే! జగన్‌ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…

16 minutes ago