
వైస్సార్ చెరిష్మాని అడ్డుపెట్టుకుని జగన్ ఆంధ్రాలో రాజకీయం మొదలుపెట్టి అధికారం దిశగా అడుగులువేసి ప్రభుత్వాన్ని స్థాపించగలిగారు. అదే చెరిష్మాను వాడుకుని తెలంగాణలో కూడా తమ రాజకీయానికి పునాదులు వేసుకోవాలని ఆశపడిన షర్మిలకు తెలంగాణ ప్రజలు నిరాశనే మిగిల్చారని చెప్పాలి.
వైస్సార్ టీపీ పార్టీని స్థాపించి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన పట్టించుకోని తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం పై ఎన్ని విమర్శలు చేసిన స్పందించని అధికార పార్టీ, మద్దతు తెలుపని ప్రతిపక్షాలు అందరూ కలిసి వైస్సార్ టిపినీ కనీసం ఒక రాజకీయ పార్టీగా కూడా గుర్తించలేదని చెప్పాలి. అలాగే ఆంధ్రాలో అన్న విజయంలో తనవంతు పాత్ర పోషించిన షర్మిలకు అన్నజగన్ నుంచి కూడా ఆశించిన మద్దతు దక్కకపోవడంతో ఇక పార్టీని నడపడం సాధ్యం అని భావించిన షర్మిల వైస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేద్దామని సిద్దపడి ఢిల్లీ పెద్దలతో చర్చలు కూడా జరిపారు.
అయితే కారణం ఏదైనా కానీ కాంగ్రెస్ అధిష్టానం షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి నిరాకరించడంతో ఇక చేసేదేమి లేక ఎవరు అడగకపోయినా కాంగ్రెస్ పార్టీకి బేషరతు మద్దతు పలికి ప్రస్తుతానికి ఎన్నికలలో పోటీ చేయాల్సిన గండం నుండి తప్పించుకోగలిగారు. అయితే “కాలం కలిసిరాకపోతే కర్రే పామై కాటేస్తుంది” అంటారు. అలాగే పార్టీ నేతలే ఇప్పుడు వైస్సార్ టిపినీ బిఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడానికి సిద్దపడి బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత అయినా హరీష్ రావు చెంతకు చేరారు.
గట్టు రామచంద్ర రావు, సత్యవతి ఇతర పార్టీ సభ్యులందరు కలిసి హరీష్ రావు తో సంప్రదింపులు జరిపి తమతో చర్చలు జరపకుండా బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు తెలపడం తమకు నచ్చలేదని, పార్టీ బలోపేతానికి కృషి చేసిన తమకు షర్మిల అన్యాయం చేసిందంటూ షర్మిల పై విమర్శలు చేస్తూ పార్టీని బిఆర్ఎస్ లో విలీనం చేసుకోవాలంటూ కోరారు. విలీనానికి వచ్చిన నేతలందరినీ తమ్ ఆపార్టీలో సాదరంగా ఆహ్వానించారు హరీష్ రావు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి తమవంతు సేవలందించాల్సిందిగా హరీష్ వారికీ దిశా నిర్దేశం చేశారు. మొత్తానికి తానొకటి తలిస్తే పార్టీ నేతలు మరొకటి తలిచినట్టు తానూ కాంగ్రెస్ లో విలీనం చేయాలనీ భావించి కాంగ్రెస్ కు మద్దతు తెలిపితే పార్టీ నేతలు మాత్రం అనూహ్యంగా బిఆర్ఎస్ నేతల చుట్టూ తిరిగి తానూ స్థాపించిన పార్టీని తన అనుమతి లేకుండానే బిఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడం చూస్తోంటే ఇదంతా కూడా దేవుడి స్క్రిప్టులో భాగమే అనిపిస్తుంది.
A film can have a weak trailer, little audience interest and still look like a…
After the 2024 Assembly election victory, TDP, Jana Sena and BJP are preparing for their…