
కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరుతారు? ఏ హోదాలో పనిచేస్తారు? ఏపీకి వెళతారా లేక తెలంగాణలోనే ఉంటారా?తెలంగాణలో ఉంటే ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీ చేస్తారా లేక మీడియాలో వచ్చిన్నట్లు కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళతారా?వంటి అసలు విషయాలు ఏవీ ఆమె చెప్పనే లేదు. బహుశః వీటన్నిటిపై తెలంగాణ కాంగ్రెస్‌తో కూడా చర్చించి ఆమోదం తీసుకోవలసి ఉంటుంది కనుకనే కాంగ్రెస్ అధిష్టానం కూడా వైఎస్ షర్మిలతో భేటీపై ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఆమె సోనియా, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు కనుక కాంగ్రెస్‌లో చేరడం ఖాయం అయిన్నట్లే. కనుక ముహూర్తం ప్రకటించవలసి ఉంది. తెలంగాణ అంశాల గురించే చర్చించామని, తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తానని వైఎస్ షర్మిల చెప్పారు కనుక ఆమె తెలంగాణ కాంగ్రెస్‌లోనే చేరబోతున్నట్లు భావించవచ్చు.
ఆమె పాలేరు నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేయాలనుకొన్నప్పటికీ, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేదా త్వరలో కాంగ్రెస్‌లో చేరాలనుకొంటున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరూ కూడా పాలేరు నుంచే పోటీ చేయాలనుకొంటున్నారు. కనుక వైఎస్ షర్మిలకు అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చు.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఆమెకు చోటు లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టిన్నట్లు ముందే చెప్పినప్పటికీ వైఎస్ షర్మిలని తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికతో కొత్త సమస్యలు మొదలవవచ్చు. ఈవిషయం కాంగ్రెస్ అధిష్టానానికి కూడా బాగా తెలుసు. కనుక వైఎస్ షర్మిలను జాతీయ కార్యవర్గంలోకి తీసుకొని ఆమె సేవలను రెండు తెలుగు రాష్ట్రాలలో ఉపయోగించుకొనే అవకాశం కనిపిస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలలో సిఎం చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలకు హ్యాండ్ ఇచ్చారంటూ వైసీపీ సొంత మీడియా పుంఖానుపుంఖాలుగా కధనాలు ప్రచురిస్తూనే…
Making a commercial action film with a 75-year-old superstar is not an easy task. However,…